బీసీసీఐ ఛీ కొట్టింది.. ఐపీఎల్ తన్ని తరిమేసింది.. కట్‌చేస్తే.. 23 బంతుల్లో ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్..
Prithvi Shaw Sends Big IPL Message: దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో చండీగఢ్‌పై 222 పరుగులు సాధించి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ తన దూకుడు చూపిస్తూ, ఐపీఎల్‌లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

భారత జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ పృథ్వీ షా, తన విద్వంసకర బ్యాటింగ్‌తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించి తన సత్తా చాటాడు.
కెప్టెన్‌గా అరంగేట్రంలోనే అదరగొట్టిన షా..
మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో షా కీలక పాత్ర పోషించాడు. అతను కేవలం 36 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 183కి పైగా ఉండటం విశేషం.
పృథ్వీ షా మెరుపు ఆరంభంతో పాటు, యువ ఆటగాడు అర్షిన్ కులకర్ణి కూడా చెలరేగి ఆడాడు. అర్షిన్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి జోరుతో మహారాష్ట్ర జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఐపీఎల్ వేలానికి ముందు కీలక సందేశం..
ముంబై క్రికెట్ నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన పృథ్వీ షా, తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పృథ్వీ షాను కొనుగోలు చేయలేదు. అయితే, డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఈ ఇన్నింగ్స్ ద్వారా షా ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపినట్లయింది.
ఇదికూడా చదవండి: గంభీర్, అగార్కర్‌ల మూర్ఖత్వానికి నలుగురు బలి.. టీమిండియా నుంచి ఇలా గెంటేశారేంటి..?
దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో చండీగఢ్‌పై 222 పరుగులు సాధించి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లోనూ తన దూకుడు చూపిస్తూ, ఐపీఎల్‌లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




