NZ vs PAK Head To Head: సెమీస్‌లో నిలవాలంటే, గెలవాల్సిందే.. గత రికార్డుల్లో బాబర్ సేనదే హవా..
ICC World Cup 2023: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాతే న్యూజిలాండ్ జట్టు జోరు కోల్పోయింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు నంబర్ 1 నుంచి నంబర్ 4కి వచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే తమ ఆశలను నిలుపుకోవాలనుకుంటుంది.

ICC World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో 35వ మ్యాచ్ నేడు అంటే నవంబర్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు నాకౌట్ లాంటి మ్యాచ్‌గా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా సెమీ ఫైనల్‌కు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. న్యూజిలాండ్ ఈ ప్రపంచ కప్‌ను అద్భుతంగా ప్రారంభించింది. వరుసగా 4 మ్యాచ్‌లను గెలుచుకుంది. కానీ, ఆ తర్వాత పరస్థితి మారింది.
న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్: హెడ్ టు హెడ్..
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాతే న్యూజిలాండ్ జట్టు జోరు కోల్పోయింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు నంబర్ 1 నుంచి నంబర్ 4కి వచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే తమ ఆశలను నిలుపుకోవాలనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డులను ఓసారి చూద్దాం..
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 115 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ 51 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్థాన్ 60 మ్యాచ్‌లు గెలిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ 31 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్తాన్ 22 వన్డే మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో విదేశాలలో న్యూజిలాండ్ 6 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 15 మ్యాచ్‌లు గెలిచింది. ఇక తటస్థ వేదిక గురించి మాట్లాడితే, ఈ విషయంలో కూడా పాకిస్తాన్ పైచేయి సాధించింది. న్యూజిలాండ్ 14 గెలుపొందగా, తటస్థ వేదికలపై పాకిస్థాన్ 23 మ్యాచ్‌లు గెలిచింది.
ఇది కాకుండా ఈ రెండు జట్ల మధ్య గత ఐదు వన్డే మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, న్యూజిలాండ్ ఒక మ్యాచ్ మాత్రమే గెలవగా, పాకిస్తాన్ 4 మ్యాచ్‌లు గెలిచింది.
ఈ లెక్కలు చూస్తుంటే న్యూజిలాండ్ పై ఎప్పుడూ పాకిస్థాన్ దే పైచేయి అని అనిపిస్తోంది. ముఖ్యంగా తటస్థ వేదికలపై, న్యూజిలాండ్ కంటే పాకిస్తాన్ ఎక్కువ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 4న జరగనున్న మ్యాచ్ కూడా ఇరు జట్లకు తటస్థ వేదికగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
టోర్నీలో పాకిస్థాన్ మంచి ఫామ్‌లో లేకపోయినా, ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొంది. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ రికార్డు చాలా బాగుంది. గత ఐదు ప్రపంచకప్‌లలో 2011 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో మాత్రమే పాకిస్థాన్ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌కే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తు్న్నారు.
పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్..
View this post on Instagram
బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.
న్యూజిలాండ్ ఆప్లేయింగ్ ఎలెవన్..
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్/కైల్ జామీసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








