PAK vs AFG: పాకిస్తాన్ పరువు తీసేసిన అఫ్గన్.. మ్యాచ్ హైలెట్స్ వీడియో చూశారా?
ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సోమవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 22వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మరి ఎంతో ఉత్కంఠగా పాకిస్తాన్ వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్‌ను మిస్ అయ్యారా? ఎంచెక్కా హైలెట్స్ చూసి ఎంజాయ్ చేయండి.
ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. సోమవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 22వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది . పాక్ విధించిన 283 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గనిస్తాన్ జట్టు 6 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అఫ్గనిస్తాన్ జట్టుకు పాక్‌పై విజయం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందుకే మ్యాచ్ తర్వాత ఆ జట్టు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ జట్టుకు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58), ఇమామ్ ఉల్ హక్ (17) శుభారంభం అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ బాబర్ ఆజం 92 బంతుల్లో 74 పరుగులు చేశాడు. సౌద్ షకీల్ 25 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో షాదాబ్ ఖాన్ 38 బంతుల్లో 40 పరుగులు చేయగా, ఇఫ్తికర్ అహ్మద్ కేవలం 27 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. దీంతో పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గుర్బాజ్ (65) ఔటయ్యాడు. ఈ దశలో కలిసి వచ్చిన ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా 2వ వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో 87 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. నాలుగో స్థానంలో వచ్చిన రహమత్ షా 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లాడు. మరి ఎంతో ఉత్కంఠ రేపిన పాకిస్తాన్ వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్‌ను మిస్ అయ్యారా? ఎంచెక్కా హైలెట్స్ చూసి ఎంజాయ్ చేయండి.
పాకిస్తాన్ వర్సెస్ అఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ హైలెట్స్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..