PAK vs AFG: అదరగొట్టారు బ్రో.. గ్రౌండ్‌లో రషీద్‌ ఖాన్‌తో కలిసి ఇర్ఫాన్‌ పఠాన్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే డిపెండింగ్‌ ఛాంపియన్‌ను మట్టి కరిపించిన ఆ జట్టు తాజాగా పొరుగు దేశం పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సోమవారం చెన్నైలోని చెపాక్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్గన్‌. పాక్‌ విధించిన 283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన

PAK vs AFG: అదరగొట్టారు బ్రో.. గ్రౌండ్‌లో రషీద్‌ ఖాన్‌తో కలిసి ఇర్ఫాన్‌ పఠాన్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?
Rashid Khan, Irfan Pathan
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2023 | 9:22 AM

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే డిపెండింగ్‌ ఛాంపియన్‌ను మట్టి కరిపించిన ఆ జట్టు తాజాగా పొరుగు దేశం పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సోమవారం చెన్నైలోని చెపాక్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో పాకిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అఫ్గన్‌. పాక్‌ విధించిన 283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (87), రహ్మత్ షా (77) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. తమ జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందిస్తారు. ఏ ఫార్మాట్‌లో నైనా పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి వన్డే విజయం. అందుకే మ్యాచ్‌ పూర్తయిన తర్వాత అఫ్గన్‌ ఆటగాళ్ల అంబరాలు సంబరాన్నంటాయి. చెపాక్‌ మైదానం అంతటా తిరుగతూ తమను ఎంకరేజ్‌ చేసిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ తమ జాతీయ పతకాన్ని చేత పట్టుకుని మైదానం అంతా కలియ తిరిగాడు. ఇదే సందర్భంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎదురుకావడంతో అతనితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇలా ఖాన్‌, పఠాన్‌ లిద్దరూ స్టెప్పులేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా వన్డే ప్రపంచకప్‌లో స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా విధులు నిర్వహిస్తున్నాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. ఈ సందర్భంగా అప్ఘాన్ విజయాన్ని తాను కూడా సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు. అఫ్ఘాన్ ఆటగాళ్లను ప్రత్యేకగా అభినందించిన ఈ స్వింగ్‌ సుల్తాన్‌ రషీద్ ఖాన్‌తో కలిసి మైదానంలోనే డ్యాన్స్ చేశాడు. ఆ వెంటనే రషీద్‌ను ఆలింగనం చేసుకొని మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడారంటూ అందరికీ అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో బాబర్‌ ఆజామ్‌ కెప్టెన్సీపై పరోక్షంగా విమర్శలు చేశాడు ఇర్ఫాన్‌. ‘ప్రపంచ కప్‌లో బాబర్ కెప్టెన్సీ అంత అద్భుతంగా ఏమీ లేదు’ అంటూ చురకలు అంటించాడు.

బాగా ఆడారు..

అఫ్గన్‌ చేతిలో ఓటమి అనంతరం బాబర్ ఆజమ్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి మమ్మల్ని బాధించింది. మ్యాచ్‌ బాగానే ఆడాం. అయితే బౌలింగ్ బలహీనంగా ఉండడంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. ప్రత్యర్థి పరుగులను మేం ఆపలేకపోయాం. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించింది. మేము బౌలింగ్, ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేశాం. తదుపరి మ్యాచ్‌లో వీటిని పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’ అని చెప్పుకొచ్చాడు.

ఓటమి బాధించింది: బాబర్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..