ICC World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనల్ రేసులో అఫ్గనిస్తాన్! ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
సోమవారం చెన్నైలోని ఎమ్ ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ 8 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై విజయం సాధించడం అఫ్గానిస్థాన్ కు ఇదే తొలిసారి. కాగా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు.
వన్డే ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్ అదరగొడుతోంది. పసికూన, క్రికెట్ బేబీస్ అన్న ట్యాగ్‌లను తుడిచేసుకుంటూ బలమైన జట్లపై ఘనమైన విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్ సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు పెద్ద షాక్ వచ్చింది. సోమవారం చెన్నైలోని ఎమ్ ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ 8 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌పై విజయం సాధించడం అఫ్గానిస్థాన్ కు ఇదే తొలిసారి. కాగా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ 4 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు కూడా చెరో 4 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తదుపరి నాలుగు మ్యాచ్‌లు వరుసగా శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది.
ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే..
అఫ్గానిస్థాన్ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే 12 పాయింట్లు ఖాతాలో వస్తాయి. ఆ 12 పాయింట్లతో ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించడం అఫ్టన్‌కు కష్టమే. అయితే ఇంగ్లండ్, పాకిస్తాన్‌లకు షాకిచ్చినట్లే మరొకసారి సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇప్పటి ప్రదర్శనను కొనసాగిస్తే శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించడం అఫ్గన్ జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఆస్ట్రేలియా మరో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం 4 మ్యాచ్‌లు గెలిస్తే కమిన్స్ టీమ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే.. పాకిస్థాన్ జట్టు ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటన్నింటిలోనూ గెలిస్తే బాబర్ సేన ఖాతాలోనూ 12 పాయింట్లు చేరుతాయి. సెమీస్ బెర్తుకు ఛాన్స్ ఉంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను పాకిస్థాన్ ఓడించాల్సి ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లు సాధించింది. ఇక 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.
పాక్ పై విక్టరీ.. అఫ్గన్ ఆటగాళ్లలో నయా జోష్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..