ఆసీస్ చేతిలో పాక్ చిత్తు
టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పుంజుకుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఆసీస్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్ అర్ధసెంచరీతో రాణించగా.. హఫీజ్ 46, సారథి సర్ఫరాజ్ 40 పరుగులు చేశారు. అయితే […]
టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పుంజుకుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఆసీస్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
పాక్ ఆటగాళ్లలో ఇమాముల్ హక్ అర్ధసెంచరీతో రాణించగా.. హఫీజ్ 46, సారథి సర్ఫరాజ్ 40 పరుగులు చేశారు. అయితే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం పాక్ కొంప ముంచింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లుతో చెలరేగగా.. స్టార్క్, రిచర్డ్ సన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.