AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ vs బంగ్లాదేశ్: హెడ్ టు హెడ్ మ్యాచ్‌ల వివరాలు!

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా మంగళవారం టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా జైత్రయాత్రకు ఆదివారం నాటి మ్యాచ్‌లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌ను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు బంగ్లా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన […]

భారత్ vs బంగ్లాదేశ్: హెడ్ టు హెడ్ మ్యాచ్‌ల వివరాలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 7:57 PM

Share

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా మంగళవారం టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా జైత్రయాత్రకు ఆదివారం నాటి మ్యాచ్‌లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌ను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు బంగ్లా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.

టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. దీంతో 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా… బంగ్లాదేశ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి… 3 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రస్తుతం 7 పాయింట్లతో బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టోర్నీలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మొత్తం 35 వన్డేలు జరగ్గా ఇండియా 29 వన్డేల్లో విజయం సాధించగా… 5 వన్డేల్లో ఓడిపోయింది.ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.