World Cup 2025 : ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కౌంట్ డౌన్ షురూ.. టీమిండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే?
మహిళల క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది మన భారతదేశమే. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ఇకపై కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

World Cup 2025 : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి వన్డే ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగుతుంది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 30, మంగళవారం: భారత్ vs శ్రీలంక – బెంగళూరు
అక్టోబర్ 1, బుధవారం: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – ఇండోర్
అక్టోబర్ 2, గురువారం: బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 3, శుక్రవారం: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – బెంగళూరు
అక్టోబర్ 4, శనివారం: ఆస్ట్రేలియా vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 5, ఆదివారం: భారత్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 6, సోమవారం: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – ఇండోర్
అక్టోబర్ 7, మంగళవారం: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ – గువాహటి
అక్టోబర్ 8, బుధవారం: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 9, గురువారం: భారత్ vs దక్షిణాఫ్రికా – వైజాగ్
అక్టోబర్ 10, శుక్రవారం: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 11, శనివారం: ఇంగ్లాండ్ vs శ్రీలంక – గువాహటి
అక్టోబర్ 12, ఆదివారం: భారత్ vs ఆస్ట్రేలియా – వైజాగ్
అక్టోబర్ 13, సోమవారం: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 14, మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 15, బుధవారం: ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 16, గురువారం: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ – వైజాగ్
అక్టోబర్ 17, శుక్రవారం: దక్షిణాఫ్రికా vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 18, శనివారం: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 19, ఆదివారం: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 20, సోమవారం: శ్రీలంక vs బంగ్లాదేశ్ – కొలంబో
అక్టోబర్ 21, మంగళవారం: దక్షిణాఫ్రికా vs పాకిస్థాన్ – కొలంబో
అక్టోబర్ 22, బుధవారం: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – ఇండోర్
అక్టోబర్ 23, గురువారం: భారత్ vs న్యూజిలాండ్ – గువాహటి
అక్టోబర్ 24, శుక్రవారం: పాకిస్థాన్ vs శ్రీలంక – కొలంబో
అక్టోబర్ 25, శనివారం: ఆస్ట్రేలియా vs శ్రీలంక – ఇండోర్
అక్టోబర్ 26, ఆదివారం: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – గువాహటి
అక్టోబర్ 26, ఆదివారం: భారత్ vs బంగ్లాదేశ్ – బెంగళూరు
అక్టోబర్ 29, బుధవారం: సెమీఫైనల్ 1 – గువాహటి/కొలంబో
అక్టోబర్ 30, గురువారం: సెమీఫైనల్ 2 – బెంగళూరు
నవంబర్ 2, ఆదివారం: ఫైనల్ – కొలంబో/బెంగళూరు
నాలుగోసారి భారత్‌లో ప్రపంచ కప్
భారత మహిళల క్రికెట్ జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో 2013, 1997,1978 సంవత్సరాలలో భారత్ ఈ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి కూడా భారత గడ్డపై కప్ జరగడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




