IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్-పాకిస్థాన్ జట్లు.. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. మ్యాచ్ ఎప్పుడంటే?

ICC Women World Cup 2022: ఇటీవల, ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2021లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో మరోసారి భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.

IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్-పాకిస్థాన్ జట్లు.. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ.. మ్యాచ్ ఎప్పుడంటే?
India Womens Vs Pakistan Womens
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2021 | 10:47 AM

ICC Women World Cup 2022: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ మార్చి 4, 2022 నుండి ప్రారంభమవుతుంది. బే ఓవల్‌ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు మరోసారి తలపడనున్నాయి. దీని సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. గ్రౌండ్ కూడా ఖరారు అయ్యింది. తేదీ కూడా వచ్చేసింది. ఈ రెండు జట్లు పురుషుల క్రికెట్‌లో కాకుండా మహిళల క్రికెట్‌లో తలపడనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ప్రపంచకప్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ.. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగనుందో కూడా తెలిసిపోయింది. ఈ మ్యాచ్ మార్చి 6న జరగనుంది. బే ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తోనే ప్రపంచకప్‌లో ఇరు జట్లు తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి.

ఈ టోర్నమెంట్ లీగ్ ఫార్మాట్‌లో జరుగుతుంది. అయితే అన్ని జట్లు తమ గ్రూపులోని జట్లతో మ్యాచ్‌లు ఆడాలి. టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. అంటే సెమీఫైనల్‌కు ముందు ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత, మొదటి నాలుగు జట్లకు సెమీ-ఫైనల్‌కు టిక్కెట్లు లభిస్తాయి. ఆ తర్వాత ఫైనల్‌ ఆడనుంది.

31 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. 2017, 2020 మధ్య ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో స్థానం ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, దక్షిణాఫ్రికా టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మరోవైపు, న్యూజిలాండ్ హోస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అర్హత పొందింది.

10న రెండో మ్యాచ్.. రెండో మ్యాచ్‌ ఆడేందుకు ముందు భారత్‌కు మూడు రోజుల విశ్రాంతి లభిస్తుంది. 6వ తేదీన ఆడిన తర్వాత, భారత్ తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 10న ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 12న సెడెన్ పార్క్‌లో భారత జట్టు మళ్లీ వెస్టిండీస్‌తో ఆడనుంది. దీని తర్వాత, మార్చి 16న ఈ టోర్నమెంట్‌లో ప్రస్తుత విజేత ఇంగ్లాండ్‌తో తన తదుపరి మ్యాచ్ ఆడనునుంది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియాతో భారత్ మళ్లీ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మార్చి 19న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనుంది. భారత్ మార్చి 22న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. హామిల్టన్‌లోని సెడెన్ పార్క్‌లో మ్యాచ్ జరగనుంది. 27న క్రైస్ట్ చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత జట్టు బరిలోకి దిగనుంది.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ చివరి ఎడిషన్ ఇంగ్లాండ్‌లో జరిగింది. మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరినా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ రెండుసార్లు ఫైనల్‌కు చేరింది. 2017కి ముందు మిథాలీ రాజ్ సారథ్యంలో భారత మహిళల జట్టు ఫైనల్ ఆడినా విజయం సాధించలేకపోయింది.

Also Read: Virat Kohli: మొదటిసారి మీడియా ముందుకు కోహ్లీ.. కెప్టెన్నీ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేనా.. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలిచ్చేనా?

Rohit Sharma-Virat Kohli: వారిద్దరే సమాధానమివ్వాలి.. అప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చొద్దు: భారత మాజీ సారథి