Virat Kohli: మొదటిసారి మీడియా ముందుకు కోహ్లీ.. కెప్టెన్నీ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేనా.. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలిచ్చేనా?

IND vs SA: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తొలగించగా, అతని స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ వివాదాలపై విరాట్ కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడనున్నాడు.

Virat Kohli: మొదటిసారి మీడియా ముందుకు కోహ్లీ.. కెప్టెన్నీ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేనా.. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలిచ్చేనా?
Virat Kohli Record
Follow us

|

Updated on: Dec 15, 2021 | 9:58 AM

Virat vs Rohit: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించినప్పటి నుంచి ఈ వెటరన్ ఆటగాడు మీడియా వార్తల్లో నిలుస్తున్నాడు. విరాట్ కోహ్లి గురించి రోజురోజుకు ఇలాంటి వార్తలు ఎక్కువ అవుతున్నాడు. అయితే, ఈ పుకార్లు లేదా వార్తలు వ్యాప్తి చెందడంతో, ప్రస్తుతం విరాట్ కోహ్లీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి అనేక పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాడు. విరాట్ కోహ్లీ బుధవారం మీడియాతో ప్రసంగించనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ఈ విలేకరుల సమావేశం జరుగుతుంది. డిసెంబర్ 16న భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. అయితే అంతకంటే ముందు విరాట్ కోహ్లీ నుంచి చాలా పెద్ద ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

విరాట్ కోహ్లీ నుంచి చాలా సమాధానాలు తెలుసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అతను వన్డే కెప్టెన్‌గా కొనసాగాలనుకుంటున్నాడా? టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్న సమయంలో, విరాట్ కోహ్లీ వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాడు. అయితే అకస్మాత్తుగా సెలెక్టర్లు అతన్ని వన్డే కెప్టెన్సీ నుండి కూడా తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు.

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు సెలక్టర్లు అతనితో మాట్లాడలేదా అనేది విరాట్ కోహ్లి నుంచి ఎదురుచూస్తున్న రెండవ పెద్ద సమాధానం. నిజానికి దక్షిణాఫ్రికా టూర్‌కు టెస్టు జట్టును ఎంపిక చేసిన తర్వాత విరాట్ లేకపోవడంతో సెలక్టర్లు మరోసారి సమావేశం నిర్వహించారని, అందులో అతడిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలపై విరాట్ కోహ్లి నుంచి కచ్చితంగా సమాధానం రావలసి ఉంటుంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనేది మూడో ప్రశ్న. వాస్తవానికి, వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ అకస్మాత్తుగా గాయపడ్డాడు. అతను టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడనే సందేహం అభిమానుల మదిలో ఉంది, కాబట్టి ఖచ్చితంగా విరాట్ కోహ్లీని ఈ విషయంపై ఒక ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది.

విరాట్ కోహ్లీ నుంచి రావాల్సిన నాల్గవ సమాధానం ఏమిటంటే, అతను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడతాడా? లేదా? టెస్టు సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ బీసీసీఐ నుంచి సెలవు కోరినట్లు సమాచారం. ఈ వార్త ధృవీకరించలేదు. కానీ, మీడియా ప్రపంచం మొత్తంలో అలాంటి చర్చే జరుగుతోంది. ఈ ప్రశ్నకు విరాట్ కోహ్లీ స్వయంగా బుధవారం విలేకరుల సమావేశంలో సమాధానం చెప్పే అవకాశం ఉంది.

Also Read: Rohit Sharma-Virat Kohli: వారిద్దరే సమాధానమివ్వాలి.. అప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చొద్దు: భారత మాజీ సారథి

Kohli vs Rohit: ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదు.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆయన ఆడతాడు: క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ