Rohit Sharma-Virat Kohli: వారిద్దరే సమాధానమివ్వాలి.. అప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చొద్దు: భారత మాజీ సారథి

India Tour Of South Africa: తాజాగా బీసీసీఐ విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా నియమించడంతో పాటు టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య..

Rohit Sharma-Virat Kohli: వారిద్దరే సమాధానమివ్వాలి.. అప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చొద్దు: భారత మాజీ సారథి
Sunil Gavaskar
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2021 | 9:52 AM

Sunil Gavaskar: భారత క్రికెట్‌లో వాతావరణం చాలా హాట్‌గా మారింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య వాతావరణం అంతా బాగోలేదని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై పలువురు మాజీ ఆటగాళ్లు మాట్లాడారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెరపైకి రానంతవరకు, ఈ విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడవద్దని గవాస్కర్ కోరారు. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి, అతడి స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్, కోహ్లి మధ్య చెడిందనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి.

ఇండియా టుడేతో గవాస్కర్ ఈ విషయంపై మాట్లాడారు. “ప్రశ్న ఏమిటంటే, నిజంగా ఏదైనా జరుగుతోందా? ఇద్దరు ఆటగాళ్లు ముందుకు వచ్చి ఏ విషయం చెప్పనంతవరకు మనం ఈ విషయంలోకి తొంగి చూడకూడదు. అవును అజహరుద్దీన్ ఏదో చెప్పాడు. కానీ, అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకే వారిద్దరే వచ్చి ఏమి జరిగిందో చెప్పాలి’ అంటూ పేర్కొన్నారు.

ఇద్దరు ఆటగాళ్లు ముందుకు వచ్చే వరకు వారిపై ఎలాంటి నిందలు వేయవద్దని గవాస్కర్ కోరారు. “అప్పటి వరకు నేను ఇద్దరు ఆటగాళ్లను తప్పుపట్టను. ఎందుకంటే ఇద్దరు ఆటగాళ్లు దేశానికి అత్యుత్తమ సేవలందించారు. కాబట్టి మనలో ఎవరైనా వారిపై వేలు చూపడం సరైనదని నేను అనుకోను” అంటూ బదులిచ్చారు.

అజారుద్దీన్ ఏమన్నాడంటే.. అంతకుముందు, మాజీ భారత కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ, ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇటీవలి చర్యలతో బాగా చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అజారుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ట్వీట్ చేశాడు. “విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడనని, రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేడని తెలియజేశాడు. విరామాలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, అందుకు సమయం మెరుగ్గా ఉండాలి. ఈ నిర్ణయాలతో వీరిద్దరి మధ్య టెన్షన్‌ వాతావరణం నెలకొందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ఏ ఫార్మాట్‌ను వదులుకోరు’’ అని అన్నారు.

Also Read: Kohli vs Rohit: ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదు.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆయన ఆడతాడు: క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Watch Video: ఈ బౌన్సర్ చాలా డేంజర్.. బెన్‌స్టోక్స్‌ దెబ్బకు షాకైన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో..!