Watch Video: ఈ బౌన్సర్ చాలా డేంజర్.. బెన్‌స్టోక్స్‌ దెబ్బకు షాకైన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో..!

ENG vs AUS: అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. మంగళవారం ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో..

Watch Video: ఈ బౌన్సర్ చాలా డేంజర్.. బెన్‌స్టోక్స్‌ దెబ్బకు షాకైన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో..!
Ben Stokes Bouncer Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2021 | 8:24 AM

ENG vs AUS: అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. మంగళవారం ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బంతిని ఎదుర్కొంటూ కనిపించాడు. ఈ సమయంలో, స్టోక్స్ నుంచి ప్రమాదకరమైన బౌన్సర్ రూట్ హెల్మెట్‌ను తాకింది.

అయితే, గాయం తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే రూట్ తిరిగి బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇక రెండో టెస్టు మ్యాచ్ డే నైట్‌గా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ పింక్ బాల్ తోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీడియోలో స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం కనిపించింది. అయితే బ్రిస్బేన్ టెస్టులో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించలేకపోయాడు. తొలి టెస్టులో స్టోక్స్ కూడా గాయపడ్డాడు. అతను కేవలం 12 ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. అలాగే ఈ ఆటగాడు చాలా నో బాల్స్‌ వేశాడు. ఈ వీడియో చూస్తుంటే రెండో టెస్టులో బౌలింగ్ చేసేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

రూట్ అద్భుత ప్రదర్శన.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అతను కుదురుకొని 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రూట్ ఔటయ్యాక బ్యాట్స్‌మెన్ ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి యాషెస్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Also Read: Kohli vs BCCI: కెప్టెన్సీ వివాదం వెనుకున్న అసలు కారణం అదేనా.. కోహ్లీ నిర్ణయంతో ఇబ్బందుల్లోకి బీసీసీఐ.. చక్రం తిప్పిన గంగూలీ..!

IND VS SA: వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఫ్లాప్.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు ఎంపిక కష్టమే.. ప్రమాదంలో ఆ సీనియర్ ప్లేయర్ కెరీర్‌..!

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా