Kohli vs BCCI: కెప్టెన్సీ వివాదం వెనుకున్న అసలు కారణం అదేనా.. కోహ్లీ నిర్ణయంతో ఇబ్బందుల్లోకి బీసీసీఐ.. చక్రం తిప్పిన గంగూలీ..!
భారత క్రికెట్‌లో మరోసారి కెప్టెన్సీ వివాదం నెలకొంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించారు. దీని తర్వాత అతను దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు విరామం తీసుకున్నాడు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో ఆడాల్సిన టెస్టు సిరీస్‌కు..
Virat Kohli vs BCCI: భారత క్రికెట్‌లో మరోసారి కెప్టెన్సీ వివాదం నెలకొంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించారు. దీని తర్వాత అతను దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు విరామం తీసుకున్నాడు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీలో ఆడాల్సిన టెస్టు సిరీస్‌కు గాయపడిన రోహిత్ దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ముందు కష్టాలు పెరుగుతున్నా.. ఇప్పటికే పరిమిత ఓవర్లలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లి నుంచి కెప్టెన్సీని లాక్కోవడానికి కారణమేంటన్నది ప్రశ్న.
2021లో కరోనా రెండవ వేవ్ మధ్యలో కూడా బీసీసీఐ IPL పూర్తి చేయాలని కోరుకుందంట. దానిని రద్దు చేసే ఆలోచన బీసీసీఐకి లేదు. మే 3న, కోహ్లి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. టీమ్‌లోని ఇద్దరు సభ్యులు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత కేకేఆర్‌తో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ సున్నితంగా నిరాకరించాడు.
కోహ్లి తిరస్కరణకు ముందు, ఏ జట్టు కరోనా గురించి మాట్లాడలేదు. కానీ, బెంగళూరు, కోల్‌కతా మధ్య మ్యాచ్ రద్దు అయిన తర్వాత, ఇతర ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్లతోపాటు సిబ్బంది ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. మ్యాచ్ ఆడటానికి నిరాకరించాయి. దీనికి కారణం కూడా ఉంది. కోల్‌కతా ఏప్రిల్ 29న అహ్మదాబాద్‌లో ఢిల్లీతో మ్యాచ్ ఆడింది. సందీప్ వారియర్, వరుణ్‌లు ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, జట్టులో ఉండడంతో ఆందోళన మరింత పెరిగింది.
ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకత రావడంతో మే 3న జరగాల్సిన బెంగళూరు-కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడింది. దీని తర్వాత మే 4న మొత్తం ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూలం ప్రకారం, కోహ్లీ నిరాకరించడంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐపీఎల్‌ను వాయిదా వేస్తే నష్టం వాటిల్లుతుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసినా కోహ్లీ పట్టించుకోలేదు. దీని తరువాత, IPL 2021 మిగిలిన మ్యాచ్‌లు UAEలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరిగాయి. అంతే కాదు భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరగలేదు. ఇది కూడా యూఏఈలోనే చేయాల్సి వచ్చింది.
బోర్డు నష్టాలను చవిచూసింది. ఆపై కోహ్లి కారణంగా బీసీసీఐ IPL, T20 ప్రపంచ కప్‌ను కోల్పోయింది. ఇవన్నీ కాకుండా కోహ్లీ తీసుకున్న మరో నిర్ణయం బోర్డుకు ఆగ్రహం తెప్పించింది. సెప్టెంబర్ 16న జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో లేఖ రాస్తూ టీ20 జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పని భారాన్ని ఇందుకు కారణంగా చూపించారు. బోర్డ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉండాలని కోరినప్పటికీ, కోహ్లీ రాజీనామా చేశాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించారు.
దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. బీసీసీఐ, సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని.. నాకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఇకపై విరాట్ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని, వన్డేలు, టీ20లకు రోహిత్ బాధ్యతలు నిర్వహిస్తాడని” ఆయన అన్నారు.
3 ఫార్మాట్‌లు, 3 ప్లేయర్‌లు.. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల జాబితాలో వీరే టాప్..!