IND sv AUS: స్టేడియాన్నే కాదు.. భారత్‌నూ సైలెంట్ చేస్తాం.. ప్రెస్‌మీట్‌లో చెప్పి, లైవ్‌లో నిరూపించిన పాట్ కమ్మిన్స్..

|

Nov 19, 2023 | 4:43 PM

2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా సంతోషపడ్డారు. కానీ, తాను తీసుకున్న నిర్ణయం నిజమేనని నిరూపించాడు

IND sv AUS: స్టేడియాన్నే కాదు.. భారత్‌నూ సైలెంట్ చేస్తాం.. ప్రెస్‌మీట్‌లో చెప్పి, లైవ్‌లో నిరూపించిన పాట్ కమ్మిన్స్..
Ind Vs Aus Pat Cummins
Follow us on

IND sv AUS: 2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా సంతోషపడ్డారు. కానీ, తాను తీసుకున్న నిర్ణయం నిజమేనని నిరూపించాడు ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్. పవర్ ప్లేలోపే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే మరో వికెట్, ఇలా తన నిర్ణయాన్ని మరింత రుజువు చేసుకున్నాడు ఈ ఆస్ట్రేలియా కెప్టెన్.

అలాగే, 54 పరుగుల వద్ద విరాట్ కోహ్లీని కూడా షార్ట్ బాల్‌తో తెలివిగా పెవిలియన్ చేర్చాడు. దీంతో ప్రెస్ మీట్‌లో తను చెప్పినట్టుగా లైవ్ మ్యాచ్‌లో చేసి చూపించాడు.

మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ మాట్లాడుతూ- 1.3 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్ సమయంలో స్టాండ్స్ నుంచి టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తుంటారు. వారిని నిశ్శబ్దం చేయడం చాలా సంతృప్తికరమైన అనుభవంగా ఉంటుంది’ అంటూ డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ప్రీ-మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లే.. లైవ్ మ్యాచ్‌లోనూ చేసి చూపించాడు. అలాగే స్టేడియాన్ని నిశ్శబ్దంగా ఉంచాడు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియా ఫ్యాన్స్‌ను సైలెంట్‌గా మార్చేశాడు.

మ్యాచ్ విషయానికి వస్తే..

టీమిండియా 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.

54 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అతను పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విరాట్ తన వన్డే కెరీర్‌లో 72వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 9వ సారి 50కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో విరాట్‌కి ఇది 12వ అర్ధశతకం.

4 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (47 పరుగులు) గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అదే సమయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4 పరుగులు) మూడోసారి మిచెల్ స్టార్క్‌కు బలయ్యాడు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..