AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేలి చేస్తారా?..ఎలా ఉంది మా రో’హిట్’ సర్జికల్ స్ట్రయిక్

వరల్డ్‌కప్ 2019లో భారత్‌ దుమ్మురేపింది. పాక్‌తో  జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో  విజయదు:దుభి మోగించింది. అయితే భారత అద్భుత విజయం వెనుక రోహిత్ శర్మ కీలక భూమిక పోషించారు. మాంచెస్టర్ వేదికగా భారత్ వైస్ కెప్టెన్  చెలరేగిపోయాడు. ‘ఫ్యాన్స్ హిట్ మ్యాన్’ గా పిలుచుకునే రోహిత్ ఆ పేరుకు న్యాయం చేసేలా.. ఫోర్లు, సిక్సులతో పాకిస్థానీ బౌలర్లను బెంబేలెత్తించాడు. బౌండరీలతో వర్షంతో విరుచుకుపడిన రోహిత్ శర్మ 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 14 ఫోర్లు, 3 సిక్సులు […]

గేలి చేస్తారా?..ఎలా ఉంది మా రో'హిట్' సర్జికల్ స్ట్రయిక్
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2019 | 8:02 AM

Share

వరల్డ్‌కప్ 2019లో భారత్‌ దుమ్మురేపింది. పాక్‌తో  జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో  విజయదు:దుభి మోగించింది. అయితే భారత అద్భుత విజయం వెనుక రోహిత్ శర్మ కీలక భూమిక పోషించారు. మాంచెస్టర్ వేదికగా భారత్ వైస్ కెప్టెన్  చెలరేగిపోయాడు. ‘ఫ్యాన్స్ హిట్ మ్యాన్’ గా పిలుచుకునే రోహిత్ ఆ పేరుకు న్యాయం చేసేలా.. ఫోర్లు, సిక్సులతో పాకిస్థానీ బౌలర్లను బెంబేలెత్తించాడు. బౌండరీలతో వర్షంతో విరుచుకుపడిన రోహిత్ శర్మ 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 14 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 140 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోర్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై సోషల్ మీడియాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్‌ను వింగ్ కమాండర్ అభినందన్‌తో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేశాడంటూ అభినందన్ మీసం కట్టుతో రోహిత్ మార్పింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా, వింగ్ కమాండర్‌ అభిందన్‌ను కించపరుస్తూ ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ యాడ్‌ను ప్రసారం చేసింది. అంతేకాదు మాంచెస్టర్ స్టేడియంలోనూ అభినందన్‌ను అవమానించేలా బ్యానర్లు ప్రదర్శించారు పాకిస్తానీలు. దాంతో వారికి సోషల్ మీడియా వేదికగా గట్టిగా బుద్ధి చెబుతున్నారు భాతర అభిమానులు. పాకిస్తానీ ఫ్యాన్స్‌కు కౌంటర్‌గా రోహిత్ శర్మ సెంచరీ పోజులను వైరల్ చేస్తున్నారు.

Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్