
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ బుధవారం (ఫిబ్రవరి 19) ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇక ఫిబ్రవరి 20 నుంచి టీమిండియా మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక భారత జట్టు తన రెండో మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతుంది. టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 2న దుబాయ్‌లో జరుగుతుంది. అంటే తొలి రౌండ్‌లో టీమిండియా దుబాయ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. దీని తర్వాత, టీం ఇండియా సెమీఫైనల్స్, ఫైనల్‌కు చేరుకుంటే మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
కాగా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఈ సారి భారత్‌లో జియో, హాట్ స్టార్ నెట్వర్క్ ప్రసారం చేయనున్నాయి. ఇందులో భాగంగానే టీవీల్లో స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్స్‌లో ప్రసారం కానున్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, తమిళం, కన్నడ వంటి 8 భాషల్లో ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో లైవ్ మ్యాచ్ లు చూడవచ్చు.
ఇక డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచు లను జియోస్టార్‌లో వీక్షించవచ్చు. గతంలో జియో టీవీ, హాట్ స్టార్ యాప్స్ లలో ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు జియో, హాట్‌స్టార్ రెండూ కలిసి జియోస్టార్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులను చూడాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అంటే టీవీలో మాత్రమే మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చన్నమాట.
🚨 ICC confirmed Broadcast Details TV and Digital for Champions Trophy 2025…!!!
Pakistan: PTV and Ten Sports, Streaming options: Myco and Tamasha app
India: JioStar (Live streaming on Jio Hotstar, Television coverage on Star and Network 18 channels)
Caribbean: ESPNCaribbean… pic.twitter.com/BPO62GrqDe
— Qasim Tahir (@qasimtahir503) February 15, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి