AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : బర్త్ డే కేక్ కట్ చేయని వైభవ్ సూర్యవంశీ.. సెలబ్రేట్ చేసుకోకపోవడానికి కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అతను చెప్పిన కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vaibhav Sooryavanshi : బర్త్ డే కేక్ కట్ చేయని వైభవ్ సూర్యవంశీ.. సెలబ్రేట్ చేసుకోకపోవడానికి కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
Vaibhav Sooryavanshi (3)
Rakesh
|

Updated on: Mar 31, 2026 | 9:25 AM

Share

Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల తన 15వ పుట్టినరోజును జరుపుకున్నాడు. సాధారణంగా ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీల్లో ఆటగాళ్ల పుట్టినరోజు అంటే టీమ్ మొత్తం కలిసి భారీగా వేడుకలు చేస్తుంది. కేక్ కటింగ్, ఆటపాటలు సందడిగా ఉంటాయి. కానీ వైభవ్ మాత్రం తన కేక్ కటింగ్ వేడుకకు హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటని అడిగితే.. “ఆరోజు కేక్ కటింగ్ చేయాల్సి ఉంది, కానీ నేను ముందే పడుకున్నాను. అందరూ కలిసి నా మొహానికి కేక్ పూస్తారనే భయంతో తప్పించుకోవడానికి త్వరగా వెళ్లి నిద్రపోయాను” అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ చిన్నారి ఆటగాడి అమాయకత్వం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గ్రౌండ్‌లో మాత్రం బాదుడే

పుట్టినరోజు నాడు కేక్ కటింగ్ మిస్ అయినా, గ్రౌండ్‌లో మాత్రం చెన్నై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి, తన బర్త్‌డే గిఫ్ట్‌ను తానే ఇచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. “కోచ్ కుమార సంగాక్కర, ఇతర సీనియర్ ప్లేయర్లు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నా సహజసిద్ధమైన దూకుడును ఏమాత్రం తగ్గించవద్దని చెప్పారు. పవర్ ప్లేలో మ్యాచ్‌ను మా వైపు తిప్పుకోవడమే మా ప్లాన్, అది వర్కవుట్ అయింది” అని వైభవ్ తెలిపాడు.

యశస్వి జైస్వాల్ గైడెన్స్

తన ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్ గురించి చెబుతూ.. “జైస్వాల్ భయ్యా ప్రతి బంతికి నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలో, ఎప్పుడు స్ట్రైక్ మార్చాలో చెబుతూ నన్ను ప్రోత్సహిస్తుంటాడు. బంతి బ్యాట్‌కు బాగా తగులుతుంటే షాట్లు ఆడమని ధైర్యం చెబుతాడు” అని వైభవ్ వివరించాడు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్ ఆటతీరును ప్రశంసించాడు. నెట్స్ లో అతని బ్యాటింగ్ చూసి మేమంతా ఆశ్చర్యపోయామని, అతను తన సహజ శైలిలో ఆడేలా తాము మద్దతు ఇస్తామని పరాగ్ పేర్కొన్నాడు.

చెన్నై కెప్టెన్ ఏమన్నాడంటే?

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఓటమిపై స్పందిస్తూ.. ప్రారంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాలుగా మారిందని, స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించిందని చెప్పాడు. బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని, కానీ 127 పరుగులు ఏమాత్రం సరిపోలేదని ఒప్పుకున్నాడు. వైభవ్ లాంటి యువ ఆటగాళ్లు ఇంతటి తెగువతో ఆడటం గొప్ప విషయమని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us