Azharuddin HCA: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ చుట్టూ వివాదం ముదురుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై బుధవారం వేటుపడింది. ఇదిలా ఉంటే ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నోటీస్ జారీ చేశారు. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 11న జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. ఇక హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని విమర్శలు చేసిన విషయం విధితమే.
Also Read: దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’
Delhi AIIMS: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. సంఘటన స్థలానికి చేరుకున్న 22 ఫైర్ ఇంజన్లు..
డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !