AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే..

Harry Brook Comments: భారత జట్టుకు నయా ఫినిషర్‌గా ఎదుగుతున్న శివమ్ దూబేను ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద సవాలుగా మారింది. హ్యారీ బ్రూక్ ఎంతగా వ్యూహాలు మార్చినా, మైండ్ గేమ్స్ ఆడినా.. క్రీజులో దూబే నిలదొక్కుకుంటే ఇంగ్లాండ్‌కు రెండో టీ20లోనూ చుక్కలు కనపడటం ఖాయమని భారత అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే..
Ind Vs Eng 2nd T20i Harry Brook Comments
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 3:22 PM

Share

Harry Brook Comments: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సమరం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తొలి మ్యాచ్‌లో వర్షం పడటంతో ఫలితం తేలకపోయినప్పటికీ, టీం ఇండియా హిట్టర్ శివమ్ దూబే ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ శిబిరంలో వణుకు పుట్టించింది. ఈ నేపథ్యంలో రెండో టీ20కి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

దూబే విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బతికిపోయింది..!

సెస్టర్లీ స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ప్రారంభంలోనే ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో అభిషేక్ శర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఇంగ్లాండ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దూబే మెరుపు దాడి వల్లే భారత్ నిర్ణీత ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే అంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లాండ్‌కు అసాధ్యమని, కేవలం వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతోనే ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకుందని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ..!

ఇవి కూడా చదవండి

హ్యారీ బ్రూక్ పప్పులో కాలేశాడు..!

శివమ్ దూబేకు స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడటంలో అద్భుతమైన రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అతను స్పిన్నర్లపై విరుచుకుపడతాడు. ఈ విషయం తెలిసి కూడా తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పిన్నర్లను రంగంలోకి దించి పెద్ద తప్పే చేశాడు. దూబే ఆ స్పిన్ బౌలింగ్‌ను ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ వ్యూహాత్మక లోపాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ స్వయంగా అంగీకరించక తప్పలేదు.

దూబేను తక్కువ అంచనా వేయలేం.. బ్రూక్ సరికొత్త వ్యూహాలు..!

రెండో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీం ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ల కంటే కూడా శివమ్ దూబేపైనే తాము ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందన్నాడు. “తొలి మ్యాచ్‌లో దూబేను తక్కువ అంచనా వేసి తప్పు చేశాం, మా వ్యూహం బెడసికొట్టింది. అతని వల్లే మా ముందు భారీ లక్ష్యం నిలిచింది. కానీ, రెండో టీ20లో ఆ తప్పును పునరావృతం చేయం. దూబేను కట్టడి చేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాం” అని బ్రూక్ తెలిపాడు. అలాగే తమ బౌలింగ్ విభాగంలో కూడా రెండు కీలక మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.

ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లీటర్ పెట్రోల్ 2, డీజిల్ 39పైసలు.. 50కే ఫుల్ ట్యాంక్..
లీటర్ పెట్రోల్ 2, డీజిల్ 39పైసలు.. 50కే ఫుల్ ట్యాంక్..
BMW కొత్త స్పోర్ట్స్ బైక్ లాంఛ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
BMW కొత్త స్పోర్ట్స్ బైక్ లాంఛ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే