CWG 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. భారత జట్టు సారథిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దాయాదుల పోరు ఎప్పుడంటే?

Women Team India Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 15 మంది ప్లేయర్లకు చోటివ్వగా, మరో ముగ్గుర్ని స్టాండ్‌బై‌గా ఉంచారు.

CWG 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. భారత జట్టు సారథిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దాయాదుల పోరు ఎప్పుడంటే?
Cwg 2022 Women Cricket Team
Follow us
Venkata Chari

| Edited By: Team Veegam

Updated on: Jul 19, 2022 | 6:44 PM

Women Team India Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ కూడా భాగమైంది. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు జులై 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టుతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

ఈ టోర్నీకి సెలక్షన్ కమిటీ ఇద్దరు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌లకు చోటు కల్పించింది. తాన్యా భాటియాతో పాటు యాష్టికా భాటియాకు కూడా అవకాశం కల్పించారు. అదే సమయంలో, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజ కూడా జట్టులో ఉన్నారు. హర్లీన్ డియోల్, స్నేహ రానా కూడా జట్టులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, టీం ఇండియా గ్రూప్‌-ఏలో చోటు దక్కించుకుంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జులై 29న బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. రెండో గ్రూప్ మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుంది. దీని తర్వాత మూడో మ్యాచ్ బార్బడోస్‌తో జరగనుంది.

భారత మహిళల జట్టు – హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, మేఘన, తాన్య సప్నా భాటియా (కీపర్), యాష్టికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్ , జెమిమా రోడ్రిగ్జ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రానా.

స్టాండ్‌బై – సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!