AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : ఎవరూ ఊహించని అమ్మాయితో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ పాండ్యా ?

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతూ మైదానంలో బిజీగా ఉండగా, అతనికి సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. పాండ్యా తాజాగా మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Hardik Pandya : ఎవరూ ఊహించని అమ్మాయితో  సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హార్ధిక్ పాండ్యా ?
Hardik Pandya
Rakesh
|

Updated on: Nov 30, 2025 | 5:19 PM

Share

Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతూ మైదానంలో బిజీగా ఉండగా, అతనికి సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. పాండ్యా తాజాగా మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత సంవత్సరం తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న పాండ్యా, ఇప్పుడు మోడల్ మాహికా శర్మతో కలిసి ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ పూజలో పాల్గొంటున్నట్లుగా కనిపిస్తున్నారు. దీనిని వారి ఎంగేజ్మెంట్‎గా చెబుతున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించిన అధికారిక ధృవీకరణ ఇంకా జరగలేదు.

మై వడోదర అనే ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా మరియు మాహికా శర్మ ఇద్దరూ పక్కపక్కన కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ నలుగురు పండితులు కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిని కొందరు నెటిజన్లు వీరిద్దరి ఎంగేజ్మెంట్ అని చెబుతున్నారు. ఇటీవల మాహికా శర్మ చేతికి ఒక పెద్ద డైమండ్ రింగ్ కనిపించింది. అప్పుడే ఆమె ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు వచ్చాయి, కానీ ఆమె ఆ వార్తలను ఖండించారు.

హార్దిక్ పాండ్యా, మాహికా శర్మ గత కొంతకాలంగా కలిసి కనిపిస్తున్నారు. వీరిద్దరూ మొట్టమొదట ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సుదీర్ఘ వెకేషన్‌కు కూడా వెళ్లారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా, తాము రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఇప్పుడు వీరిద్దరూ తమ బంధంలో తదుపరి అడుగు వేయడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా 2024లో తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా, నటాషా 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్నారు. 2023లో ఉదయ్‌పూర్‌లో వారు మరోసారి సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2024లో విడిపోయారు. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా పేరు కొంతకాలం సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా వినిపించింది. ఆమె ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి కూడా వచ్చేది. కానీ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, మాహికా శర్మతో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..