IPL 2024: షాకింగ్ న్యూస్.. పాత గూటికే చేరిన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ హిస్టరీలో భారీ ట్రేడింగ్..
హార్దిక్ పాండ్యా 2015లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టడానికి ముందు, హార్దిక్ జట్టు కోసం 92 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 85 ఇన్నింగ్స్‌లలో 27.33 సగటు, 153.91 స్ట్రైక్ రేట్‌తో 1476 పరుగులు చేశాడు. ఇది కాకుండా బౌలింగ్‌లో 31.26 సగటుతో 42 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌లో భాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు.
Hardik Pandya, IPL 2024: హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. నివేదిక ప్రకారం, ముంబై ట్రేడ్ ద్వారా IPL 2024 కోసం హార్దిక్ పాండ్యాను తన జట్టులో చేర్చుకుంది. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరడం ఐపీఎల్ 2024కి ముందు భారీ మార్పు చోటు చేసుకుంది. తరచుగా ఐపీఎల్ ట్రేడ్‌లో ఆటగాళ్ల మార్పు, అంటే జట్లు ఒకరితో ఒకరు ఆటగాళ్లను మార్చుకుంటారు. కానీ, ఈసారి గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయంలో జరిగడం గమనార్హం.
‘క్రిక్‌బజ్’ నివేదిక ప్రకారం, ఈ ఒప్పందంలో (హార్దిక్ పాండ్యా ట్రేడ్), గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ నుంచి ఏ ఆటగాడిని తీసుకోలేదు. ఈ డీల్‌లో ముంబై, గుజరాత్‌కు చెందిన రెండు జట్లు పాల్గొన్నాయి. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా పాత IPL ఫ్రాంచైజీ, దీని ద్వారా అతను టోర్నమెంట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ. 2022లో, కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ అతనిని తమ జట్టులో చేర్చుకుంది. హార్దిక్ గుజరాత్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ డీల్‌తో ముంబైకి ఎంత లాభం, గుజరాత్ జట్టుకు ఎంత నష్టం వాటిల్లుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో ఇదే అతిపెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చు. తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను ఒకసారి (2022లో) ఛాంపియన్‌గా చేసిన తర్వాత, హార్దిక్ తర్వాతి సీజన్‌లో (IPL 2023) గుజరాత్ టైటాన్స్‌ను రెండోసారి ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్స్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
హార్దిక్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం..
హార్దిక్ పాండ్యా 2015లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టడానికి ముందు, హార్దిక్ జట్టు కోసం 92 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 85 ఇన్నింగ్స్‌లలో 27.33 సగటు, 153.91 స్ట్రైక్ రేట్‌తో 1476 పరుగులు చేశాడు. ఇది కాకుండా బౌలింగ్‌లో 31.26 సగటుతో 42 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌లో భాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్‌కు వచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.