AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరుపై ముంబై విజయం

ఐపిఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు మరో చక్కటి విజయం లభించింది. డికాక్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 నాటౌట్‌) మెరుపులతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు విజయాలతో ముంబై మూడో స్థానానికి చేరింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు […]

బెంగళూరుపై ముంబై విజయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2019 | 6:14 AM

Share

ఐపిఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు మరో చక్కటి విజయం లభించింది. డికాక్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 నాటౌట్‌) మెరుపులతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు విజయాలతో ముంబై మూడో స్థానానికి చేరింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (51 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75), మొయిన్‌ అలీ (32 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 50) అర్ధ సెంచరీలు సాధించారు. మలింగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి నెగ్గింది. చాహల్‌, అలీకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా లసిత్‌ మలింగ నిలిచాడు.