T20 World Cup: ఓటమి ఎఫెక్ట్.. కెప్టెన్‌గా హార్దిక్.. త్వరలోనే పలు షాకింగ్ రిటైర్మెంట్స్.?
ఐపీఎల్ తొలి సీజన్‌లో కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఇప్పటికే రోహిత్ తర్వాత టీ20 కెప్టెన్‌గా అయ్యేందుకు..
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లీష్ బ్యాటర్లు జోస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) ఆడుతూ పాడుతూ చేధించారు.
తొలుత భారత్ బ్యాటింగ్ సమయంలో.. ఈ పిచ్‌పై రన్స్ రావడం కష్టమేనని అందరూ అనుకున్నా.. ఇంగ్లాండ్ ఓపెనర్లు మాత్రం సునాయాసంగా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు. టీమిండియాను నాకౌట్ చేసేశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ అనంతరం భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. టీమిండియా టీ20 క్యాంపయిన్‌పై పలు సంచలన కామెంట్స్ చేశారు. సెమీస్ ఓటమితో టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు త్వరలోనే రిటైర్మెంట్ తీసుకుంటున్నారని సునీల్ గవాస్కర్ తెలిపాడు. సంచలన రిటైర్మెంట్స్‌తో పాటు టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యే అవకాశాలు లేకపోలేదన్నాడు.
‘ఐపీఎల్ తొలి సీజన్‌లో కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఇప్పటికే రోహిత్ తర్వాత టీ20 కెప్టెన్‌గా అయ్యేందుకు హార్దిక్ రేసులో మొదటి ఉన్నాడు. భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా టీ20లకు జట్టు సారధ్య బాధ్యతలు చేపడతాడు. అలాగే మీరు ఊహించనటువంటి కొన్ని రిటైర్మెంట్‌లు కూడా ఉంటాయని’ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో తెలిపాడు.
He is right. Some T20I careers are done tonight. https://t.co/XCinVLitOy
— IPL 2022 (@iplthebest) November 10, 2022