Virender Sehwag Birthday: మైదానంలో బౌలర్లకు చుక్కలు.. నెట్టింట్లో ఫ్యాన్స్‌కు మాత్రం నవ్వులు.. తనదైన స్టైల్‌తో ఆకట్టుకుంటోన్న నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్

అక్టోబర్ 20 న 43 వ ఏట అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా తనదైన ముద్ర వేశాడు. మైదానంలో అతని తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు.

Virender Sehwag Birthday: మైదానంలో బౌలర్లకు చుక్కలు.. నెట్టింట్లో ఫ్యాన్స్‌కు మాత్రం నవ్వులు.. తనదైన స్టైల్‌తో ఆకట్టుకుంటోన్న నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్
Happy Birthday Virender Sehwag
Follow us

|

Updated on: Oct 20, 2021 | 11:42 AM

Virender Sehwag Birthday: అక్టోబర్ 20 న 43 వ ఏట అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలోనే కాదు.. వెలుపల కూడా తనదైన ముద్ర వేశాడు. మైదానంలో అతని తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. అనంతరం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సెహ్వాగ్.. ‘సోషల్ మీడియా’లో చమత్కార ట్వీట్లకు మారుపేరుగా నిలిచాడు. సందేశాలలో చమత్కారాన్ని జోడించి అటు అభిమానులతోపాటు నెటిజన్లను కూడా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌లో నవ్వులు పూయిస్తుంటాడు.

13 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా నిలిచాడు. ‎సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 లు, 104 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 23 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలతో 8,586 పరుగులు చేసిన సెహ్వాగ్.. తక్కువ కాలంలోనే ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో 82 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ 8273 పరుగులు పూర్తి చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా సెహ్వాగ్ రెండు సెంచరీలు చేశాడు. అతని బ్యాటింగ్‌తోనే కాదు.. సెహ్వాగ్ బంతితో కూడా ఆకట్టుకున్నాడు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్‌గా బౌలింగ్ చేసిన సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో 40 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 96 వికెట్లు సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.

‘నవాఫ్ ఆఫ్ నజాఫ్‌గఢ్’ ఎల్లప్పుడూ చమత్కారమైన మెసేజ్‌లతో ఆకట్టుకుంటాడేని తెలిసిందే. ఎలాంటి సీన్‌కైనా ఒక జోక్ సిద్ధంగా ఉంటుంది. ‘విరు’ తన అభిమానులను ఎల్లప్పుడూ సంతోషం కలిగించేందుకు తనదైన స్టైల్‌లో ట్వీట్లు చేస్తుంటాడు.

సెహ్వాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఫన్నీ ట్వీట్లు మీకోసం:

అక్టోబర్ 2016 లో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించడంతో ఆంగ్లేయులను ట్రోల్ చేస్తూ..

రవిచంద్రన్ అశ్విన్‌ను అభినందిస్తూ ఒక ఫన్నీ ట్వీట్..

విరాట్ బ్యాటింగ్‌ను అభినందిస్తూ..

పెళ్లి టిప్స్ అందిస్తూ..

రాహుల్ తెవాటియాను అభినందిస్తూ..

Also Read: T20 World Cup 2021: తొలి మ్యాచులో మోకాలిపై కూర్చుని నిరసన.. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్ల నిర్ణయం.. ఎందుకో తెలుసా?

T20 World Cup Controversies: రూల్స్ బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్‌.. కెరీర్‌నే ప్రమాదంలో పడేసిన ఓ సంఘటన.. అదేంటంటే?

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.