IND Vs ENG: తెలుగోడిపై ఎందుకా చిన్నచూపు.. టీమిండియాను ఏకీపారేసిన మాజీ క్రికెటర్..

మరో రెండు రోజుల్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టు‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్‌ వికెట్ కీపర్లు కాగా..

IND Vs ENG: తెలుగోడిపై ఎందుకా చిన్నచూపు.. టీమిండియాను ఏకీపారేసిన మాజీ క్రికెటర్..
India Vs England
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 13, 2024 | 1:50 PM

మరో రెండు రోజుల్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా జట్టు ప్రకటించగా.. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టు‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ధృవ్ జోరెల్, కెఎస్ భరత్‌ వికెట్ కీపర్లు కాగా.. వీరిలో ధృవ్ జోరెల్ మూడో టెస్టుకు అరంగేట్రం చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వరుస రెండు మ్యాచ్‌ల్లో వైఫల్యాలు, తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినప్పటికీ.. దాన్ని మూడంకెలుగా కన్వర్ట్ చేయడంలో భరత్ ఫెయిల్ కావడంతో.. అతడి స్థానంలో ధృవ్ జోరెల్ బెటర్ ఆప్షన్ అని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్.

ఈ క్రమంలోనే భారత మాజీ వికెట్ కీపర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో టెస్టులో శ్రీకర్ భారత్‌ను వికెట్ కీపర్‌గా కొనసాగించాలన్నాడు చోప్రా. బ్యాటింగ్‌లో వైఫల్యం అయినప్పటికీ.. కీపర్‌గా భరత్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. పిచ్‌లు కఠినంగా ఉండటంతో రాహుల్‌ను బ్యాటర్‌గా ఎంచుకున్నారు. కానీ భరత్ కీపింగ్‌ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. అతడి బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంలో చూడద్దని విజ్ఞప్తి చేశాడు.

రాహుల్‌ను బ్యాటర్‌గా ఎంచుకుని.. భరత్‌ను కీపర్‌గా ఎంచుకున్నప్పుడు.. వారిద్దరి పెర్ఫార్మెన్స్‌లు ఆయా బాధ్యతల్లోనే క్యాలుకులేట్ చేయాలి. భరత్‌ను స్పెషలిస్ట్ కీపర్‌గానే పరిగణనలోకే తీసుకోవాలి. ఒకవేళ బ్యాటర్‌గా చూడాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్ అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో తొందరపడొద్దని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా, సఫారీలతో టెస్టుల అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో భరత్‌కు కీపర్‌గా అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే మొదటి టెస్టు‌లో అతడు 69 పరుగులు చేసి అలరించగా.. రెండో టెస్టు‌లో కేవలం 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపధ్యంలో అతడ్ని మూడో టెస్టుకు ఎంపిక చేయకూడదని కొందరు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.