The Great Indian Kapil Show S3: కపిల్ షోలో క్రికెటర్ల సందడి.. నవ్వుల పూలు పూయించిన గంభీర్
'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో క్రికెటర్లు గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ సందడి చేయనున్నారు. గంభీర్ కొత్త అవతార్, సునీల్ గ్రోవర్ సిద్ధూ స్పూఫ్ ఈ ఎపిసోడ్‌కు హైలైట్. జూలై 5న నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి.

The Great Indian Kapil Show S3: నవ్వుల పూలు కురిపించే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రాబోయే ఎపిసోడ్‌లో క్రికెటర్లు గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మ, యుజేంద్ర చాహల్ గెస్టులుగా రాబోతున్నారు. స్టార్ ప్లేయర్లు ఈ ఎపిసోడ్‌లో తమ అనుభవాలు పంచుకుంటూ ఒకరిపై ఒకరు సరదా కామెంట్స్ చేసుకుంటూ ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.ఈ ఎపిసోడ్ అంతా నాన్ స్టాప్ నవ్వులతో నిండి ఉండనుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో హోస్ట్ కపిల్ శర్మ ముందుగా కోచ్ గంభీర్ తో సరదాగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. పిల్లలు కాస్త చిలిపిగా మాట్లాడటానికి పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ తమ డగౌట్ కామెంట్లను నేరుగా కపిల్ సోఫాలో ఆవిష్కరించి,కామెడీ క్రియేట్ చేశారు.
ఈ ఎపిసోడ్‌లో టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న, మైదానంలో సీరియస్ పర్సన్ గా పేరుగాంచిన గౌతమ్ గంభీర్ కామెడీ కూడా పండిస్తాడని తెలిసింది. ఈ ఎపిసోడ్ లో గంభీర్ మరో కోణం బయటపడిందనే చెప్పాలి. గంభీర్ తన వన్-లైనర్లతో, కపిల్‌పై చేసే సరదా పంచ్‌లతో ఇంతకు ముందెన్నడూ చూడని తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన లీడ్స్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్, కపిల్, ప్రేక్షకులను తమ నవ్వులతో అలరించారు. నేనేం తక్కవ అన్నట్లు యుజ్వేంద్ర చాహల్, పంత్‌కు తోడుగా నిలిచారు. కొత్త ప్లేయర్ అభిషేక్ శర్మ మాత్రం సీనియర్లు ఉన్నారని ఆచితూచి సేఫ్ జోకులతో బాగానే నవ్వించారు.
ఈ నవ్వుల అల్లరికి ఐకానిక్ పాత్రలైన సోనా, మోనా వచ్చి మరింత జోష్ తీసుకొచ్చారు. వారు అతిథులను సరదాగా ఆటపట్టించినా, లేదా పంచులు విసిరినా, వారి కెమిస్ట్రీ బాగా పండిందనే చెప్పాలి. మొత్తానికి ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎప్పుడూ నవ్వులకు గ్యారెంటీ. ఇప్పుడు క్రికెటర్లు గంభీర్, పంత్, చాహల్ వంటివారు వస్తుండటంతో, వారిని ఇంతకుముందు చూడని సరదా కోణంలో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గ్రోవర్ సిద్ధూ అవతారం ఖచ్చితంగా షోకు హైలైట్ అవుతుంది. వీకెండ్‌లో నవ్వుకోవడానికి జూలై 5న నెట్‌ఫ్లిక్స్‌లో తప్పకుండా చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




