
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2026 T20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ఓపెనర్ సంజూ శాంసన్‌ను అభివర్ణించారు. సంజూ శాంసన్ తనదైన రోజున పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్ల నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగలడని గంభీర్ అన్నాడు. ఇండియా మూడోసారి T20 ప్రపంచకప్ నెగ్గడంలో సంజు కీలక పాత్ర పోషించాడని, అతని బ్యాట్ పవర్ పట్ల తమకు ఎప్పుడూ అనుమానం లేదని గంభీర్ ప్రశంసలు కురిపించాడు. తొలి ఆరు ఓవర్లలోనే జట్టుని గెలిపించే సత్తా సంజుకు ఉందని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
వరల్డ్ కప్ తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పటికీ, కేవలం కాంబినేషన్ మార్చడం కోసం కాకుండా జట్టులో మరింత దూకుడు పెంచేందుకే శాంసన్‌ను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా జట్టులో వీలైనంత దూకుడుగా ఆడాలనే సిద్ధాంతంతో ఉన్నామని గంభీర్ పేర్కొన్నారు. అందుకే ఆఫ్ స్పిన్నర్‌కు కౌంటర్ ఇచ్చేందుకు కాకుండా, టాప్ ఆర్డర్ పవర్ పెంచేందుకు, పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడేందుకే సంజును ఓపెనర్‌గా దింపామన్నారు. ఒక్కొక్కసారి సంజు జోరు మొదలైతే, ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను నిలబెట్టగలడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సంజు మెరుపు బ్యాటింగ్ శైలిపై తమకు ఎలాంటి సందేహాలు లేవని, అతను ఏం చేయగలడో తమకు బాగా తెలుసని గంభీర్ తెలిపారు. టాప్ ఆర్డర్‌లో చెలరేగిపోయే మరో బ్యాటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నాకౌట్ సమయంలో శాంసన్‌ను తీసుకొచ్చామని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీలోని ఐసీసీ వార్షిక అవార్డుల వేడుక కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ చెప్పకొచ్చాడు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.
ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..