Video: 23 ఫోర్లు, 5 సిక్సర్లతో బీభత్సం.. 75 బంతుల్లోనే మ్యాచ్ క్లోజ్.. 5గురు పాక్ బౌలర్లకు చుక్కలు.. వీడియో
Gautam Gambhir - Robin Uthappa: గంభీర్, ఉతప్పల దెబ్బకు బౌలర్ల ఎకానమీ రేట్లు మారిపోయాయి. వీళ్లను ఔట్ చేసేందుకు 7గురు బౌలర్లు ప్రయత్నించారు. అందులో 5గురు పాకిస్థాన్ టాప్ క్లాస్ బౌలర్లు కావడం గమనార్హం.
Legends League Cricket 2023: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ కూడా ఆడడం లేదు. అయినా.. వీళ్ల బ్యాట్ నుంచి పరుగల వరద ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాట్ పడితే.. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. దూసుకెళ్తున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలుస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీరు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. వారెవరో కాదు.. టీమిండియా మాజీ ప్లేయర్లు గౌతమ్ గంభీర్, ఉతప్ప. దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో వీరిద్దరూ ఆసియా లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
7గురు ప్రయత్నించినా.. వికెట్లు పడగొట్టలేకపోయారు..
గంభీర్, ఉతప్పల దెబ్బకు బౌలర్ల ఎకానమీ రేట్లు మారిపోయాయి. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టారు. వీళ్లను అవుట్ చేయడానికి ఆసియా లయన్స్ 7గురు బౌలర్లను ప్రయత్నించింది. అయితే, అందులో 5గురు పాకిస్థాన్ టాప్ క్లాస్ బౌలర్లు కావడం గమనార్హం. కానీ, ఈ ఇద్దరు భారతీయుల ముందు వారి శ్రమ ఫలించలేదు. లీగ్‌లో ఇండియన్స్ మహారాజాకు అత్యంత అవసరమైన విజయాన్ని అందించారు.
20 ఓవర్ల మ్యాచ్ 75 బంతుల్లో ముగిసింది!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత మహారాజా తన ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు కూడా వేచి చూడలేదు. గంభీర్, ఉతప్ప కలిసి కేవలం 75 బంతుల్లో అంటే 12.3 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముంగించేశారు.
గంభీర్-ఉతప్ప దెబ్బకు 5గురు పాక్ బౌలర్లుకు మటాష్..
158 పరుగుల లక్ష్యాన్ని 12.3 ఓవర్లలో భారత్ మహారాజా ఛేదించింది. ఇందులో గంభీర్, ఉతప్ప కీలక పాత్ర పోషించారు. 5గురు పాకిస్థానీలు, ఇద్దరు శ్రీలంకన్స్‌తో సహా 7గురు బౌలర్లను వీరిద్దరూ చీల్చిచెండాడారు.
దెబ్బకు మారిన ఎకానమీ రేట్లు..
సోహైల్ తన్వీర్ 11 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. మహ్మద్ అమీర్ ఎకానమీ రేట్ 9.66గా నిలిచింది. మహ్మద్ హఫీజ్ 16.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అబ్దుర్ రజాక్, షోయబ్ అక్తర్ 12 ఎకానమీతో పరుగులు ఇచ్చారు.
23 ఫోర్లు, 5 సిక్సర్లతో గంభీర్-ఉతప్పల బౌండరీల వర్షం..
ఈ మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకాలు బాదిన గంభీర్, ఉతప్ప విజయంలో హీరోలుగా నిలిచారు. ఉతప్ప 39 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 225 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 88 పరుగులు చేశాడు. అదే సమయంలో గంభీర్ 36 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్‌తో 12 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఈ విధంగా ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కలిసి మ్యాచ్‌లో 23 ఫోర్లు, 5 సిక్సర్లు బాది తమ జట్టుకు విజయాన్ని అందించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేర్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..