AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: కోహ్లీ, రోహిత్‌కు ఊహించని షాక్.. ఆ ఎఫెక్ట్‌తో రూ. 200 కోట్లు లాస్..

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 క్రికెట్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయబోతోంది. భారతదేశంలో ఇప్పుడు రియల్ మనీ గేమింగ్ పూర్తిగా నిషేధించారు. దీని కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లకు పెద్ద షాక్ తగలడం ఖాయం.

Team India: కోహ్లీ, రోహిత్‌కు ఊహించని షాక్.. ఆ ఎఫెక్ట్‌తో రూ. 200 కోట్లు లాస్..
Rohit Sharma Virat Kohli
Venkata Chari
|

Updated on: Aug 27, 2025 | 8:52 AM

Share

Online Gaming Bill: భారతదేశంలో ఇటీవల ఆమోదం పొందిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ బిల్లు రియల్ మనీ గేమింగ్ (RMG) ను పూర్తిగా నిషేధించింది. ఇందులో ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి ఆటలు ఉన్నాయి. ఈ చట్టం గేమింగ్ పరిశ్రమను ప్రభావితం చేయడమే కాకుండా భారత క్రికెట్, ఆటగాళ్ళు, దానితో సంబంధం ఉన్న స్పాన్సర్‌షిప్‌లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు కోట్ల రూపాయలు కోల్పోబోతున్నారు.

భారత ఆటగాళ్లకు కోట్ల రూపాయల నష్టం..

21 ఆగస్టు 2025న, భారత పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి ఒక బిల్లును ఆమోదించింది. ఇది రియల్ మనీ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించింది. ఈ బిల్లు ప్రకారం, రియల్ మనీకి సంబంధించిన ఆన్‌లైన్ గేమ్‌లను ఆడటం లేదా హోస్ట్ చేయడం వల్ల 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1-2 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. దీంతో పాటు ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్, ప్రకటనలను కూడా నిషేధించారు. చాలా మంది భారతీయ క్రికెటర్లు ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ బిల్లు తర్వాత, ఈ ఆటగాళ్ల సంపాదనపై కూడా ప్రభావం పడవచ్చు. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్, కృనాల్ పాండ్యా డ్రీమ్ 11తో సంబంధం కలిగి ఉన్నారు. అదే సమయంలో, భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రితురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరవ్ గంగూలీ మై11 సర్కిల్‌ను ప్రమోట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా MPLను ప్రమోట్ చేయగా, ఎంఎస్ ధోని విన్జోను ప్రమోట్ చేశారు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, కోహ్లీ కాంట్రాక్ట్ సంవత్సరానికి రూ. 10-12 కోట్లు కాగా, రోహిత్ శర్మ, ధోనీలకు రూ. 6-7 కోట్లు చెల్లించారు. యువ ఆటగాళ్లకు ఈ సంఖ్య దాదాపు కోటి రూపాయలు. మొత్తం మీద, ఈ బిల్లు తర్వాత భారత క్రికెటర్లు ప్రతి సంవత్సరం రూ. 150-200 కోట్లు కోల్పోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ..

ఇప్పటివరకు, IPL, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎక్కువగా రియల్ మనీ గేమింగ్ కంపెనీల స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడి ఉన్నాయి. Dream11 భారత జట్టు కోసం రూ.358 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కుదుర్చుకుంది. My11Circle IPL కోసం రూ.625 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ బిల్లు అమలుతో, ఈ ఒప్పందాలు ప్రమాదంలో పడవచ్చు. ఇది క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..