IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధం.. టాప్ 10 రికార్డులు ఇవే.. ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs AUS Test Series Stats: సచిన్ టెండూల్కర్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.

IND vs AUS: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధం.. టాప్ 10 రికార్డులు ఇవే.. ఆధిపత్యం ఎవరిదంటే?
India Vs Australia
Follow us
Venkata Chari

|

Updated on: Feb 04, 2023 | 1:43 PM

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (IND vs AUS) ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు టెస్టు క్రికెట్‌లో 102 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 43 సార్లు గెలుపొందగా, 30 మ్యాచ్‌లు భారత్‌ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 28 టెస్టులు డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయింది. రెండు దిగ్గజ జట్ల మధ్య టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన కీలక రికార్డులు, గణాంకాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు: ఈ రికార్డు భారత్ పేరిట నమోదైంది. జనవరి 2004లో జరిగిన సిడ్నీ టెస్టులో భారత్ 7 వికెట్ల నష్టానికి 705 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

2. ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు: ఈ చెత్త రికార్డు కూడా భారత్ పేరుతోనే ఉంది. డిసెంబర్ 2020లో జరిగిన అడిలైడ్ టెస్టులో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇవి కూడా చదవండి

3. అతిపెద్ద విజయం: నవంబర్ 1947లో జరిగిన బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అండ్ 226 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

4. అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 39 మ్యాచ్‌లలో 74 ఇన్నింగ్స్‌లలో 3630 పరుగులు చేశాడు.

5. అతిపెద్ద ఇన్నింగ్స్: జనవరి 2012లో జరిగిన సిడ్నీ టెస్టులో మైఖేల్ క్లార్క్ 329 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.

6. అత్యధిక సెంచరీలు: సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 11 టెస్టు సెంచరీలు చేశాడు.

7. అత్యధిక వికెట్లు: అనిల్ కుంబ్లే ఆస్ట్రేలియాతో జరిగిన 20 మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లలో 111 వికెట్లు తీశాడు.

8. ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: డిసెంబర్ 1959లో కాన్పూర్ టెస్టులో భారత ఆటగాడు జేసుభాయ్ పటేల్ 69 పరుగులకు 9 వికెట్లు తీశాడు.

9. అతిపెద్ద భాగస్వామ్యం: జనవరి 2012లో జరిగిన అడిలైడ్ టెస్టులో, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ 386 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

10. అత్యధిక మ్యాచ్‌లు: ఈ రికార్డు కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. ఇరుదేశాల మధ్య జరిగిన 39 టెస్ట్ మ్యాచ్‌లలో భాగమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..