
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ తనపై ఉమ్మివేశాడని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ‘బాంటర్ విత్ ది బాయ్స్’ పోడ్‌కాస్ట్‌లో డీన్ ఎల్గర్ మాట్లాడుతూ, ఈ సంఘటన 2015లో జరిగిందని చెప్పారు. ఆ రోజు దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ ఆడేందుకు భారత్‌కు వెళ్లింది. మొహాలీలోని బింద్రా స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి, నాకు మధ్య మాటల వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని డీన్ ఎల్గర్ ఆరోపించాడు. ‘స్పిన్‌కు ఎంతో అనుకూలమైన మొహాలీ పిచ్ పై రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించాను. దీంతో కోహ్లి నాపై ఉమ్మివేశాడు. నేను కూడా నా భాషలో కోహ్లీని తిట్టి బ్యాట్‌తో కొడతానని హెచ్చరించా. ఈ విషయం డివిలియర్స్ కు తెలిసింది. నా టీమ్ మేట్ మీద అలా ఎందుకు ఉమ్మివేశావని వి కోహ్లీని ఏబీడీ అడిగాడు. ఆ తర్వాత రెండేళ్లకు భారత్ టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా వచ్చింది. ఆ సమయంలో కోహ్లీ నాకు సారీ చెప్పాడు. అయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కోహ్లీ పూర్తిగా మారిపోయాడు’ అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు.
‘మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ అక్కడితోనే ముగిసింది. అప్పట్లో కోహ్లీ డ్రింక్ చేసేవాడు. దీంతో మేము ఆ రోజు మూడు గంటల వరకు తాగుతూనే ఉన్నాం. అయితే ఆ తర్వాత కోహ్లీ తాగటం మానేశాడని..ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని ఈ మాజీ సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ తెలిపాడు. కాగా డీన్ ఎల్గర్ తన చివరి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఎల్గర్‌కు సరైన వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో కోహ్లీ ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. అంతేకాదు డీన్ ఎల్గర్ ను హత్తుకున్నాడు. వీడ్కోలు మ్యాచ్‌లో కోహ్లీ తన టెస్ట్ జెర్సీని కానుకగా అందించాడు.
Dean Elgar(on podcast)-
“Virat Kohli & I had a fight in 2015 but in my last match, we both came together & said Warra overseas century for Dhobi.”
A beautiful gesture by King Kohli and Dean Elgar pic.twitter.com/S3ZjbSDOLv— Muffadaal Vohra (@muffadaal_vohra) January 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..