AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2025: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌‌కు షాకిచ్చిన విదేశీ ఆటగాళ్లు?

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

PSL 2025: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌‌కు షాకిచ్చిన విదేశీ ఆటగాళ్లు?
Psl 2025 Operation Sindoor
Venkata Chari
|

Updated on: May 07, 2025 | 12:37 PM

Share

Operation Sindoor: భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025) కూడా భయం గుప్పిట్లోకి చేరుకుంది. అది కూడా విదేశీ ఆటగాళ్లు సగంలోనే వదిలిపోతారనే భయంతో అతలాకుతలమవుతోంది. ఇదిలా ఉండగా, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన వెంటనే విదేశీ ఆటగాళ్ళు పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగేందుకు సిద్ధమైనల్లు వార్తలు వచ్చాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, PSL టోర్నమెంట్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల, విదేశీ ఆటగాళ్ళు టోర్నమెంట్‌ను సగంలోనే నిష్క్రమించి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ సంవత్సరం ఐపీఎల్‌లో అవకాశం రాని చాలామంది ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కనిపించారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ ముప్పు ఉన్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు లీగ్ నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ 10 సగంలోనే ఆగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోని విదేశీ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది:

ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు: మాథ్యూ షార్ట్ (ఆస్ట్రేలియా), రిలే మెరెడిత్ (ఆస్ట్రేలియా), బెన్ డ్వార్హుయిస్; కోలిన్ మున్రో (న్యూజిలాండ్), రోసీ వాన్ డెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), ఆండ్రీస్ గౌస్ (అమెరికా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్).

ఇవి కూడా చదవండి

కరాచీ కింగ్స్ జట్టు: మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), జేమ్స్ విన్స్ (ఇంగ్లాండ్), టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్).

లాహోర్ ఖలందర్స్ జట్టు: రిషద్ హొస్సేన్ (బంగ్లాదేశ్), సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లాండ్), టామ్ కుర్రాన్ (ఇంగ్లాండ్), డేవిడ్ వీజా (నమీబియా), కుశాల్ పెరెరా (శ్రీలంక), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే).

ముల్తాన్ సుల్తాన్స్ జట్టు: డేవిడ్ విల్లీ (ఇంగ్లాండ్), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), గుడకేష్ మోటే (వెస్టిండీస్), జాన్సన్ చార్లెస్ (వెస్టిండీస్), షాయ్ హోప్ (వెస్టిండీస్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).

పెషావర్ జల్మీ జట్టు: నజీబుల్లా జద్రాన్ (ఆఫ్ఘనిస్థాన్), మాక్స్ బ్రయంట్ (ఆస్ట్రేలియా), నహిద్ రానా (బంగ్లాదేశ్), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లండ్), లిజ్ విలియమ్స్ (దక్షిణాఫ్రికా), అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్).

క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు: ఫిన్ అలెన్ (న్యూజిలాండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కైల్ జామిసన్ (న్యూజిలాండ్), రిలే రోసౌ (దక్షిణాఫ్రికా), అకీల్ హొస్సేన్ (వెస్టిండీస్).

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!