వెబ్ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌ను తలపించిన క్రేజీ బ్యాటింగ్.. 13 గంటలు.. 393 పరుగులు!

On This Day: సుదీర్ఘంగా సాగే వెబ్ సిరీస్ లలో... ఎన్ని ఎపిసోడ్‌లు ఉన్నా.. చివరి ఎపిసోడ్ లోనే అసలు మజా ఉంటుంది. 1989 జరిగిన యాషెస్ సిరీస్ ను గమనిస్తే... వెబ్ సిరీస్ లాంటి ఆసక్తి కలగమానదు.

వెబ్ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌ను తలపించిన క్రేజీ బ్యాటింగ్.. 13 గంటలు.. 393 పరుగులు!
Australia Batsmen Steve Waugh
Follow us
Venkata Chari

|

Updated on: Jul 07, 2021 | 5:50 PM

On This Day: 1989 జరిగిన యాషెస్ సిరీస్ ను గమనిస్తే… వెబ్ సిరీస్ లాంటి ఆసక్తి కలగమానదు. సుదీర్ఘంగా సాగే వెబ్ సిరీస్ లలో… ఎన్ని ఎపిసోడ్‌లు ఉన్నా.. చివరి ఎపిసోడ్ లోనే అసలు మజా ఉంటుంది. అచ్చం ఇలాగే అప్పటి యాషెస్ సిరీస్‌ కూడా ఇలాంటి అనుభూతిని ఇచ్చింది. 13 గంటల నాలుగు నిమిషాల పాటు సాగిన ఓ సూపర్ ఇన్నింగ్స్.. కచ్చితంగా వెబ్ సిరీస్ లాంటి పోలికతో ఆకట్టుకుంది. ఈ ఆసీస్ బ్యాట్స్‌మెన్ బౌలర్లకు వికెట్ సమర్పించుకోకుండా 393 పరుగులు చేశాడు. 1989 యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీంలు ఆరు టెస్టుల్లో తలపడ్డాయి. అయితే, ఈ సిరీస్ లో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ వా మొదటి రెండు టెస్టుల్లో ఒక్క బౌలర్ చేతికి చిక్కలేదు. అదే ఊపుతో మూడో టెస్టులో బరిలోకి దిగాడు. అంటే దాదాపు 13 గంటల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ఆసీస్ లెజండరీ 393 పరుగులు సాధించాడు. జులై 6 నుంచి 11 వరకు జరిగిన మూడో టెస్టులో.. స్టీవ్ వా జులై 7న మొదటిసారి తన వికెట్‌ను.. అదికూడా ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్ అంగస్ ఫ్రేజర్ కు సమర్పించుకున్నాడు. ఈ బౌలర్ ఎడ్గ్బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులో తొలిసారి బరిలోకి దిగి.. ఆసీస్ లెజండరీ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌వా వికెట్‌ను సాధించాడు. తొలి, రెండవ టెస్టుల్లో బౌలర్లకు చుక్కలు చూపించిన స్టీవ్‌వా.. ఎట్టకేలకు ఔటయ్యాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 424 పరుగులు చేసింది. వీటిలో డీన్ జోన్స్ 157 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే మార్క్ టేలర్ 43, స్టీవ్‌వా 43 పరుగులతో అలరించారు. జియోఫ్ మార్ష్ 42, ట్రెవర్ హూన్స్ 40, డేవిడ్ బూన్ 38 పరుగులు సాధించి ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించేందుకు సహాయపడ్డారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేజర్ అరంగేట్ర మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ టీం కేవలం 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ లో ఒక్కరు కూడా అర్థసెంచరీ సాధించకపోవడం గమనార్హం. ఇయాన్ బోథమ్ మాత్రమే 46 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ జాక్ రస్సెల్ 42, టిమ్ కుర్టిస్ 41 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టెర్రీ ఆల్డెర్మాన్ 3, జియోఫ్ లాసన్, మోర్వ్ హ్యూస్ తలో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. ఆ తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయడంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ టేలర్ 51 పరుగులు చేయగా, జియోఫ్ మార్ష్ 42 పరుగులు సాధించాడు.

Also Read:

India vs Sri lanka: శ్రీలంక టీంకు భారీ దెబ్బ.. టీమిండియా సిరీస్ నుంచి మాజీ కెప్టెన్ ఔట్!

Rare Photo: జార్ఖండ్ డైనమేట్ తో నటసింహం..మచ్చలేని నాయకుడు, స్ఫూర్తి నిచ్చే లెజండరీ క్రికెటర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి హీరో..!