Rare Photo: జార్ఖండ్ డైనమేట్ తో నటసింహం..మచ్చలేని నాయకుడు, స్ఫూర్తి నిచ్చే లెజండరీ క్రికెటర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి హీరో..!

అంతర్జాతీయ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్రవేసి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎలాంటి మ్యాచ్ లోనైనా తనస్టైల్ లో నిర్ణయాలు తీసుకుంటూ.. ఫలితాలు రాబట్టడంలో ఆయనొక దిట్ట.

Rare Photo: జార్ఖండ్ డైనమేట్ తో నటసింహం..మచ్చలేని నాయకుడు, స్ఫూర్తి నిచ్చే లెజండరీ క్రికెటర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన నందమూరి హీరో..!
Dhoni And Balakrishna Rare Photo
Follow us
Venkata Chari

|

Updated on: Jul 07, 2021 | 3:54 PM

Happy Birthday Dhoni: అంతర్జాతీయ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్రవేసి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎలాంటి మ్యాచ్ లోనైనా తనస్టైల్ లో నిర్ణయాలు తీసుకుంటూ.. ఫలితాలు రాబట్టడంలో ఆయనొక దిట్ట. అందుకే కెప్టెన్ కూల్ గా ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు. నేడు ఈ మహేంద్రుడి పుట్టిన రోజు(జులై 7). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ధోనీ ట్రెండ్ నడుస్తోంది. పలు హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే పలువురు ప్రముఖులు ఈ మాజీ సారథికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈమేరకు నందమూరి బాలయ్య బాబు కూడా ఈ జార్ఖండ్ డైనమేట్ కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ అరుదైన ఫొటోను షేర్ చేస్తూ..’మచ్చ లేని నాయకుడు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన లెజండరీ క్రికెటర్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫొటోను అటు బాలయ్య అభిమానులు, ఇటు ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ… కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా క్రికెట్ చరిత్రలో సచిన్ తరువాత అంతలా పాపులర్ అయిన ధోనీ.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఫేవరేట్ గా మారిపోయాడనడంలో సందేహం లేదు. 2004 వ సంవత్సరంలో టీమిండియాలోలోకి ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే కెప్టెన్ గా ఎదిగాడు. ఇక అక్కడి నుంచి తనదైన ముద్ర వేస్తూ.. మ్యాచ్ లను రక్తికట్టేంచేవాడు. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, సారథిగా ఇలా ఎన్నో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. 13 సంవత్సరాల పాటు క్రికెట్ లో కొనసాగిన ధోనీ.. తొలుత వన్డేల్లోకి 2004లో ఎంట్రీ ఇచ్చాడు. 350 వన్డేలు ఆడిన జార్ఖండ్ డైనమేట్.. 10,773 పరుగులు చేశాడు. అలాగే 2005 లో టెస్టుల్లో అడుగుపెట్టిన ధోనీ.. 90 మ్యాచులు ఆడి 4,876 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో 98 మ్యాచులు ఆడిన ధోనీ.. 1,617 పరుగులు సాధించాడు.

Also Read:

HCA: టై మ్యాచ్‌ను తలపిస్తోన్న హెచ్‌సీఏ వివాదం.. అజర్ Vs అపెక్స్ మధ్య టగ్ ఆఫ్‌ వార్

Happy Birthday Dhoni: హెయిర్ కట్ వద్దు.. పొడవాటి జుట్టుతోనే బాగున్నావ్..! ధోనీకి సలహా ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్