Ind vs Eng 4th Test: నాలుగో టెస్ట్‌లో మరో కొత్త బౌలర్ అరంగేట్రం..! జట్టులో ఉన్న 5గురు బౌలర్లలో ఎవరిపై వేటు..?

uppula Raju

uppula Raju |

Updated on: Sep 01, 2021 | 9:23 PM

Ind vs Eng 4th Test: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఓటమి తరువాత భారత జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి లండన్‌లోని ఓవల్

Ind vs Eng 4th Test: నాలుగో టెస్ట్‌లో మరో కొత్త బౌలర్ అరంగేట్రం..! జట్టులో ఉన్న 5గురు బౌలర్లలో ఎవరిపై వేటు..?
Indian Cricket

Follow us on

Ind vs Eng 4th Test: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఓటమి తరువాత భారత జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి అవకాశం లభిస్తుందో తెలియడం లేదు. కానీ ఒక రోజు క్రితం ఓ కొత్త బౌలర్‌ని భారత జట్టులో చేర్చారు. అతను మొదటి నుంచి ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుతో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను స్టాండ్‌బై బౌలర్‌గా మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు జట్టులో చేరడం విశేషం.

“ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ – టీమ్ మేనేజ్‌మెంట్ అభ్యర్థన ఆధారంగా – నాలుగో టెస్ట్ కోసం జట్టులోకి ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణను చేర్చింది” అని BCCI ఒక మీడియా ప్రకటనలో తెలిపింది ” కృష్ణ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో అరంగేట్రం చేసినప్పటి నుంచి మూడు వన్డేలు ఆడాడు. అయితే కృష్ణను జట్టులో చేర్చడం వల్ల జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లతో భారత ఫాస్ట్ బౌలింగ్ గ్రూప్ ఏడుకి విస్తరించింది. హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయం వల్ల ఓవల్‌ టెస్ట్‌లో కచ్చితంగా గెలవాలని భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో ఏకైక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్‌లో ఆడలేదు.

జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (సి), అజింక్యా రహానే (విసి), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ కృష్ణ

Viral Photos: ప్రపంచంలోని ఈ 5 విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి..! ఏంటో తెలుసుకోండి..

Dumba Goat Farm: ఈ గొర్రల పెంపకంతో లక్షలు సంపాధిస్తున్నారు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం.. పెంపకం ఎలానో తెలుసుకోండి..

Ida Hurricane: అమెరికాను వణికించిన ఇడా హరికేన్ చేసిన విధ్వంసం చూశారంటే.. కచ్చితంగా అమ్మో అంటారు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu