IND vs WI: ఛాన్సులు రాకుంటే లబోదిబో.. వచ్చాక వరుస ఫ్లాప్ షోలు.. తోడుగా నిలిచిన ఫ్యాన్స్‌కిది వెన్నుపోటే బ్రో..
IND vs WI 2nd T20: వెస్టిండీస్‌తో వరుసగా రెండు T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఓడిపోయిన టీమిండియా.. ప్రస్తుతం సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. భారత జట్టు పేలవ ప్రదర్శనపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఓ ప్లేయర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్లేయర్‌కి అవకాశాలు ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. ఈ ప్లేయర్‌కు అండగా నిలిచారు.

IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ను టీమిండియా కోల్పోయే ప్రమాదంలో చిక్కుకుంది. వెస్టిండీస్‌తో వరుసగా రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. దీంతో కీలక టోర్నీల ముందు భారత అభిమానులకు పీడకలగా మారుతోంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనకంజలో నిలిచింది. జట్టు పేలవ ప్రదర్శనను చూసిన భారత మాజీ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ ఓ బ్యాట్స్‌మన్‌ను మందలించాడు. ఈ ఆటగాడు నిరంతరం అవకాశాలను వృధా చేస్తున్నాడు. కాగా, ఈ ప్లేయర్‌కి అవకాశాలు ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. ఈ ప్లేయర్‌కు అండగా నిలిచారు. కానీ, వరుసగా విఫలమవుతూ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. దీంతో అండగా నిలిచిన వారే నేడు తిట్టిపోస్తున్నారు.
టీమ్ ఇండియా ఓటమి తర్వాత దాడికి గురైన బ్యాడ్ లక్ ప్లేయర్..
సంజూ శాంసన్ నిరంతర పేలవ ప్రదర్శనపై మాజీ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ తీవ్రంగా స్పందించాడు. అవకాశాలు వచ్చినప్పుడల్లా ఫ్లాప్ అయ్యాడంటూ చెప్పుకొచ్చాడు. పార్థివ్ పటేల్ మాట్లాడుతూ, ‘భారత జట్టులోని ఆ ఆటగాడి పేరు సంజు శాంసన్. అతనికి జట్టులో చోటు దక్కకపోవడం గురించి చాలా చర్చలు జరుగుతుంటాయి. అయితే, అవకాశం దొరికినప్పుడల్లా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. భారత్ వెస్టిండీస్ పర్యటనలో సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కింది. తనదైన ముద్ర వేయడానికి అతనికి పెద్ద అవకాశం వచ్చింది. కానీ, అతను ఇప్పటివరకు విఫలమయ్యాడు. అయితే వన్డేల్లో కచ్చితంగా హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, టీ20 సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది. ఎందుకంటే అతను ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో 19 పరుగులు మాత్రమే చేశాడంటూ విమర్శలు గుప్పించాడు.




వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఫ్లాప్..
A close game in the end in Guyana!
West Indies win the 2nd T20I by 2 wickets.
Scorecard – https://t.co/9ozoVNatxN#TeamIndia | #WIvIND pic.twitter.com/jem0j9gMzv
— BCCI (@BCCI) August 6, 2023
ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందులో శాంసన్ 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. శాంసన్ నిరంతర పేలవ ప్రదర్శనపై పార్థివ్ పటేల్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. పార్థివ్ మాట్లాడుతూ, ‘శాంసన్ జట్టులో లేనప్పుడు, ఆయనకు చోటు దక్కకపోవడంపై అంతా మాట్లాడుతున్నారు. కానీ, అవకాశం వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
తిలక్ వర్మపై ప్రశంసలు..
తిలక్ వర్మ తన తొలి అంతర్జాతీయ పర్యటనలో టీ20 సిరీస్‌లో టీమిండియా అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అతని ప్రదర్శన చూసిన పార్థివ్.. తిలక్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘తిలక్ స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం, స్పిన్నర్లపై రివర్స్ స్వీప్ కొట్టిన తీరు, కవర్ మీదుగా సిక్సర్లు కొట్టిన తీరు, అద్భుతంగా ఉందంటూ’ కొనియాడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




