టీమిండియా జెర్సీతో గ్రౌండ్‌లోకి ఎంట్రీ.. బీసీసీఐ లోగోతో సెక్యూరిటీని భయపెట్టిన అభిమాని.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
India Vs England 2021: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం లార్డ్స్ మైదానంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం లార్డ్స్ మైదానంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో ఈ రోజు మూడో రోజు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ జట్టు మూడో రోజు బ్యాటింగ్ చేస్తోంది. కెప్టెన్ జో రూట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ, మ్యాచ్‌లో ఆటగాళ్లు కాకుండా అకస్మాత్తుగా బయటి నుంచి మైదానంలోకి వచ్చిన ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. లంచ్ విరామం తర్వాత ఒక ప్రేక్షకుడు గ్రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇలాంటివి చాలాసార్తు మనం చూశాం. కానీ, ఇక్కడ జరిగింది చాలా భిన్నంగా ఉంది. ఈ వ్యక్తి సెక్యూరిటీ గార్డు మాట కూడా వినకుండా గ్రౌండ్‌లోకి ఎంటరయ్యాడు.
వాస్తవానికి, మైదానంలోకి ప్రవేశించిన వ్యక్తి టీమిండియా లోగోతో ఉన్న భారత జట్టు జెర్సీని ధరించాడు. అచ్చం భారత జట్టు టీ-షర్టు లాగానే ఉంది. ఈ కారణంగా ఆ వ్యక్తి మైదానంలోకి ప్రవేశించాడు. గ్రౌండ్ మధ్యలోకి వచ్చిన తర్వాత, సెక్యూరిటీ గార్డ్ ఈ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించాడు. ఆటగాళ్ల నుంచి అతడిని వేరు చేసేందుకు ప్రయత్నించాడు. అతని టీ షర్టుపై ఉన్న బీసీసీఐ లోగోను చూపిస్తూ సెక్యూరిటీతో గొడవపడ్డాడు.
భద్రతా సిబ్బంది ఎంట్రీతో.. సెక్యూరిటీ గార్డులు అతడిని బయటకు వెళ్లమని అడిగారు. అతను వారి మాట వినలేదు. చప్పట్లు కొడుతూ తన రెండు చేతులను పైకి ఎత్తి సంబరాలు చేసుకున్నాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది ఎంటరై ఆ వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఆ వ్యక్తి పేరు మాత్రం తెలియలేదు. ఎక్కడ నుంచి వచ్చాడో కూడా తెలియదు. కానీ అతను ధరించిన భారత జట్టు జెర్సీ వెనుక జార్వో అని రాసి ఉంది. అలాగే జెర్సీ నంబర్ 69 గా రాసి ఉంది.
రూట్ సెంచరీ.. మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా రూట్ తన ఫామ్‌ని కొనసాగించాడు. జట్టు బ్యాటింగ్ బాధ్యత కెప్టెన్ భుజాలపై వేసుకున్నాడు. జానీ బెయిర్‌స్టో అతనికి బాగా మద్దతునిచ్చాడు. 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడి, 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
New bowler from the Nursery End: Jarvo 69 ?
— Cricket Mate. (@CricketMate_) August 14, 2021
Also Read: IPL 2021: ఆటగాళ్లకు జీపీఎస్ వాచ్‌లు.. ముంబై ప్లేయర్లపై సరికొత్త ప్రయోగం.. ఎందుకో తెలుసా?
177 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. జట్టు విజయానికి బలమైన పునాది వేసిన టీమిండియా బ్యాటర్