AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

177 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. జట్టు విజయానికి బలమైన పునాది వేసిన టీమిండియా బ్యాటర్

పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ, స్ట్రైక్ రేట్ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌ ఉమెన్‌ల కంటే ఎక్కువగానే నమోదైంది. ప్రత్యర్థి జట్టుకి ఉన్నంతసేపు చుక్కలు చూపించింది.

177 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. జట్టు విజయానికి బలమైన పునాది వేసిన టీమిండియా బ్యాటర్
Shafali Verma
Venkata Chari
|

Updated on: Aug 14, 2021 | 8:55 PM

Share

177.77 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసింది. చిన్న లీగ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడింది. 17 ఏళ్ల భారత బ్యాట్స్‌ ఉమెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ, ఆమె స్ట్రైక్ రేట్ మ్యాచ్‌లోని మిగతా బ్యాటర్‌ల కంటే కూడా ఎక్కువగా నమోదైంది. తన పరుగుల దాహానికి ప్రత్యర్థి జట్టులోని మొత్తం 7 గురు బౌలర్లు బలయ్యారు. ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న మహిళల ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. భారత ఓపెనర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆమె జట్టు విజయానికి బలమైన పునాది వేసింది.

100-బాల్స్ టోర్నమెంట్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మహిళా టీంల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో, ట్రెంట్ రాకెట్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్ బౌలర్లలో గోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు. బర్మింగ్‌హామ్‌ ముందు 126 పరుగుల లక్ష్యం ఉంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగి మరో 6 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

షెఫాలీ 177.77 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ విజయానికి పునాది వేయడంలో భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ పెద్ద పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 9 బంతులు మాత్రమే ఆడింది. 177.77 స్ట్రైక్ రేట్‌తో 16 పరుగులు చేసింది. 17 ఏళ్ల కుడి చేతి వాటం బ్యాట్స్‌ ఉమెన్ షెఫాలీ.. 14 నిమిషాల పాటు క్రీజులో నిలిచింది. ఈ సమయంలో ఆమె 3 ఫోర్లు కొట్టింది. అంటే 16 పరుగులలో కేవలం 12 పరుగులు బౌండరీల ద్వారా పూర్తి చేసింది. షెఫాలీ సెట్ చేసిన ఈ వేగం ఫలితంగా బర్మింగ్‌హామ్ జట్టు ట్రెంట్ రాకెట్‌లను 6 బంతుల్లో ఓడించి విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ 94 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

7 వికెట్లు తీసినా.. ఈ మ్యాచ్‌లో, ట్రెంట్ రాకెట్స్ తన 7 గురు బౌలర్లను బరిలోకి దించింది. ఈ 7గురు కలిసి 7 వికెట్లు తీశారు. అయితే బర్మింగ్‌హామ్‌కు మ్యాచ్ గెలవడం కష్టమేమీ కాదు. కారణం షెఫాలీ అలాంటి పునాదిని నిర్మించింది. ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఒక రోజులో రాకెట్స్ జట్టుకు ఇది రెండో ఓటమి. మహిళల కంటే ముందు పురుషుల మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ చేతిలో కూడా ట్రెంట్ రాకెట్ టీం ఓడిపోయింది.

Also Read:  KL Rahul: ‘రెండేళ్ల క్రితం జట్టు నుంచి తొలగించినప్పుడు ఏం జరిగిందంటే..’! ఆనాటి రహస్యాన్ని చెప్పిన కేఎల్ రాహుల్

IND vs ENG: రాహుల్‌పై షాంపైన్ కార్క్‌లను విసిరిన ప్రేక్షకులు.. ఘాటుగా స్పందించిన కోహ్లీ..!