PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే పాక్‌కు బిగ్ షాక్.. రెండో బంతికే మైదానం వీడిన స్టార్ ప్లేయర్?

Pakistan vs New Zealand Score, Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వార్త రాసే సమయానికి న్యూజిలాండ్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. విల్ యంగ్ 4, డెవాన్ కాన్వే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే పాక్‌కు బిగ్ షాక్.. రెండో బంతికే మైదానం వీడిన స్టార్ ప్లేయర్?
Fakhar Zaman Injury

Updated on: Feb 19, 2025 | 2:53 PM

Fakhar Zaman Injury: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వార్త రాసే సమయానికి న్యూజిలాండ్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. విల్ యంగ్ 4, డెవాన్ కాన్వే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతనికి ప్లేయింగ్-11లో అవకాశం లభించింది. మరోవైపు, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయింగ్-11లో భాగం కాలేదు. టోర్నమెంట్ చరిత్రలో పాకిస్తాన్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. గత వారం, న్యూజిలాండ్ ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది.

అయితే, తొలి ఓవర్ రెండో బంతికే పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. షహీన్ షా అఫ్రిది వేసిన రెండో బంతిని విల్ యంగ్ కవర్ తరలించి, 3 పరుగులు రాబట్టాడు. అయితే, పాక్ ఫీల్డర్ ఫఖర్ దానిని బౌండరీ వెళ్లకుండా ఛేజ్ చేశాడు. కానీ, గాయపడి మైదానం వీడాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లోనే ఓ ప్లేయర్ గాయపడి, మైదానం వీడడం గమనార్హం. ఇప్పటికే గాయాలతో చాలామంది స్టార్ ప్లేయర్లు, టోర్నీ ప్రారంభానికి ముందే స్వ్కాడ్ నుంచి తప్పుకున్నారు. దీంతో కమ్రాన్ గులాంను సబ్స్టిట్యూట్ ఫీల్డర్‌గా తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఫఖర్ వన్డేలు ఆడలేదు. ఆసక్తికరంగా, ఫఖర్ తొలిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో సత్త ాచాటాడు. లండన్‌లోని ది ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌పై 114 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్‌కు దోహదపడ్డాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్కే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..