Shane Warne: ప్రతి ఒక్కరు అతనిలాగే ఉండాలనుకున్నారు.. షేన్‌ వార్న్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మాజీ ఓపెనర్..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గత వారం మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణ వార్త విని చాలా మందికి షాక్‌కు గురయ్యారు...

Shane Warne: ప్రతి ఒక్కరు అతనిలాగే ఉండాలనుకున్నారు.. షేన్‌ వార్న్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మాజీ ఓపెనర్..
Shane Warne
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 07, 2022 | 6:22 PM

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గత వారం మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణ వార్త విని చాలా మందికి షాక్‌కు గురయ్యారు. వార్న్‌కు నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కూడా వార్న్‌కు నివాళులు అర్పించారు. 18 ఏళ్ల వయస్సులో ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో తన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్ అయినా లేదా బ్యాటర్ అయినా అకాడమీలోని ప్రతి ఆటగాడు వార్న్‌ లాగా ఎలా మారాలనుకున్నాడని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.

‘‘ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీకి వెళ్లినప్పుడు నాకు 18 ఏళ్లు. బోర్డర్-గవాస్కర్ స్కాలర్‌షిప్ కోసం బీసీసీఐ ఏటా ముగ్గురు ఆటగాళ్లను పంపేది. అందుకే అడిలైడ్‌లోని అకాడమీకి వెళ్లినప్పుడు అక్కడ.. ప్రతి ఒక్కరూ షేన్ వార్న్ లాగా ఉండాలని కోరుకున్నారు” అని భారత మాజీ ఓపెనర్ గంభీర్ చెప్పాడు. గ్లెన్ మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ వంటి ఇతర ఆస్ట్రేలియన్ దిగ్గజాల పేర్లను హైలైట్ చేస్తూ గంభీర్, వార్న్ “విలక్షణమైన ఆస్ట్రేలియన్” అని వివరించాడు.

“గ్లెన్ మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ వంటి గొప్ప (ఆస్ట్రేలియన్) ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఆ 40 మంది ఆటగాళ్లలో వారు ఏమి కావాలనుకుంటున్నారని మీరు వారిని అడిగితే, అందరూ షేన్ వార్న్ అని చెప్పేవారు. ఆ ఆటగాడి ప్రభావం అలాంటిది. (షేన్ వార్న్) ఫాస్ట్ బౌలర్లు, బ్యాటర్లు కూడా షేన్ వార్న్‌గా మారాలని కోరుకున్నారు. అతను సాధారణ ఆస్ట్రేలియన్‌గా అందరూ ఉండాలని కోరుకుంటున్నాడని” అన్నారాయన. 1992లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన వార్న్, 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య్ మురళిధరన్ ఉన్నారు.

Read Also.. Virat Kohli: తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ.. వైరల్‌గా మారిన వీడియో..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.