IPL 2024: ఐపీఎల్‌‌ ఆరంగేట్రం కోసం ‘డబుల్ సెంచరీ ప్లేయర్’ సిద్ధం.. ఆటను పరీక్షించుకోవడానికి గొప్ప వేదిక అంటూ..

IPL 2024: భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న ఈ తరం ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో మెప్పించి అవకాశం పొందినవారే అని చెప్పకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జాతీయ జట్టులో అవకాశమే కాదు, ప్లేయర్ల జేబుల్లో కాసుల వర్షం కూడా కురిపించే ఫ్రాంచైజీ క్రికెట్ ఇది. ఈ కారణంగానే దేశవిదేశాల ప్లేయర్లు సైతం ఐపీఎల్‌లో ఆడి తమ సత్తా చూపించాలని కోరుకుంటారు. ఇదే ఆలోచనతో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఓ ప్లేయర్‌ వచ్చే ఐపీఎల్ సీజన్..

IPL 2024: ఐపీఎల్‌‌ ఆరంగేట్రం కోసం ‘డబుల్ సెంచరీ ప్లేయర్’ సిద్ధం.. ఆటను పరీక్షించుకోవడానికి గొప్ప వేదిక అంటూ..
IPL 2024; Zak--Crawley
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 09, 2023 | 12:10 PM

IPL 2024: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ రిచ్ లీగ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ టోర్నీలో మెప్పించిన ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం పొందడానికి ద్వారాలు తెరుచుకున్నట్లే. భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న ఈ తరం ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో మెప్పించి అవకాశం పొందినవారే అని చెప్పకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జాతీయ జట్టులో అవకాశమే కాదు, ప్లేయర్ల జేబుల్లో కాసుల వర్షం కూడా కురిపించే ఫ్రాంచైజీ క్రికెట్ ఇది. ఈ కారణంగానే దేశవిదేశాల ప్లేయర్లు సైతం ఐపీఎల్‌లో ఆడి తమ సత్తా చూపించాలని కోరుకుంటారు. ఇదే ఆలోచనతో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఓ ప్లేయర్‌ వచ్చే ఐపీఎల్ సీజన్ (ఐపీఎల్ 2024)లో ఆడడం కోసం ఐపీఎల్ 2024 వేలంలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఆ ఆటగాడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆసీస్ బౌలర్లపై చెలరేగిన జాక్ క్రాలే. యాషెస్ సిరీస్‌లో 5 టెస్టులు ఆడిన క్రాలే 480 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున 39 టెస్టులు ఆడిన క్రాలే 4 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో కలిపి మొత్తం 2204 పరుగులు చేశాడు. ఇంకా ఇంగ్లాండ్ తరఫున 3 వన్డేలే ఆడిన అతను 97 పరుగులు చేశాడు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న క్రాలే ఐపీఎల్‌లో తన సత్తా చాటుకుని ఇంగ్లాండ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
Zak Crawley

Zak Crawley

ఈ క్రమంలోనే జాక్ క్రాలే ఐపీఎల్ క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ‘ ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ టోర్నమెంట్. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు తలపడేందుకు వేదిక. గొప్ప క్రికెట్ లీగ్. ఆటగాళ్లు తమ ఆటను ఐపీఎల్‌లో పరీక్షించుకోవడం అద్భుతంగా ఉంటుంద’న్నాడు. ఇంకా IPL 2023 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే అవకాశాన్ని పొందిన హ్యారీ బ్రూక్ గురించి క్రాలే మాట్లాడుతూ..‘నా కెరీర్‌లో నేను చేయాలనుకున్న చాలావాటిని అతను చేయబోతున్నాడ’ని పేర్కొన్నాడు.

మరోవైపు కొన్ని రోజుల క్రితమే ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు విడ్కోలు ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తరఫున టీ20 క్రికెట్‌లో ఓపెనర్ స్లాట్ ఖాళీ అయింది. ఫలితంగా ఈ స్లాట్ కోసం పోటీపడుతున్న ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. ఆ ఆటగాళ్ల లిస్టులో క్రాలే పేరు కూడా ఉంది. ఈ క్రమంలో క్రాలే స్పందిస్తూ ‘నేను కనుక మంచిగా పరుగులు చేస్తే.. ఆ స్థానం నాకు దక్కే అవకాశం ఉంద’ని తెలిపాడు.