Ashes 2021-22: యాషెస్ సిరీస్‌లో కోవిడ్ కలకలం.. రెండో టెస్ట్ నుంచి ఆస్ట్రేలియా సారథి ఔట్.. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం..!
స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు అతను జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.
ENG vs AUS 2nd Test: యాషెస్ సిరీస్-2021లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియా జట్టు చిక్కుల్లో పడింది. రెండు జట్ల మధ్య సిరీస్‌లోని రెండవ టెస్ట్ డే-నైట్ ఫార్మాట్‌లో అడిలైడ్‌లో ఆడాల్సి ఉంది. అయితే దీనికి ముందు, ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బుధవారం రాత్రి కోవిడ్ -19 బారిన పడిన రెస్టారెంట్ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అడిలైడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కమ్మిన్స్ భోజనం చేస్తుండగా, అతని పక్కనే ఉన్న టేబుల్‌పై కూర్చున్న ప్యాట్రన్‌కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
కమిన్స్ వెంటనే రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లి అధికారులకు సమాచారం అందించాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. అదే సమయంలో, మిచెల్ నాజర్ తన టెస్టు అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. కమిన్స్ ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నాడని, అందువల్ల అతను ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని సౌత్ ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ధృవీకరించింది.
టెస్ట్ మాత్రం నెగిటివ్.. ఈ విషయం తెలుసుకున్న కమిన్స్ వెంటనే పీసీఆర్ పరీక్ష చేయించాడు. అయితే అందులో నెగెటివ్ వచ్చింది. కమిన్స్ బయో-సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించలేదని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. అతను మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్-డే టెస్ట్ మ్యాచ్‌కు తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది.
కమిన్స్ నిష్క్రమణ ఆస్ట్రేలియాకు భారీ దెబ్బ.. కమిన్స్ రెండో టెస్ట్ నుంచి తప్పుకోవడంతో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఇది వారి బౌలింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇద్దరు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. గాయం కారణంగా జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటికే ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. ఇక కమిన్స్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనడం లేదు. వీరిద్దరూ ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్లలో ఉన్నారు. వారి నిష్క్రమణ జట్టుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది.
మూడేళ్ల తర్వాత స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు.. మూడేళ్ల తర్వాత స్మిత్ మళ్లీ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కనిపించనున్నాడు. 2018లో దక్షిణాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ నిషేధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కెప్టెన్సీ నుంచి రెండేళ్లు, ఆటగాడిగా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత స్మిత్ ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ చేయలేదు. ఈ సిరీస్‌కు ముందు, ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వివాదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశాడు. ఈ కారణంగా కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. అలాగే స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా చేశారు.
CONFIRMED: Pat Cummins has been ruled out of the Adelaide Test.
Steve Smith will captain.
Michael Neser will debut. #Ashes
— cricket.com.au (@cricketcomau) December 16, 2021
Also Read: IND vs SA: దక్షిణాప్రికా పయణమైన కోహ్లీసేన.. తొలి టెస్ట్ సిరీస్ విజయం దక్కేనా.. 7 సార్లు నిరాశే..!