IND vs SA: దక్షిణాప్రికా పయణమైన కోహ్లీసేన.. తొలి టెస్ట్ సిరీస్ విజయం దక్కేనా.. 7 సార్లు నిరాశే..!
India Tour Of South Africa: భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరుతుంది. ఈ పర్యటనలో 3 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
India vs South Africa: విరాట్ కోహ్లి కెప్టెన్సీ విషయంలో వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో టీమిండియా ఈరోజు జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా 3 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఎప్పుడూ టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈసారి ఈ చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
విరాట్ కోహ్లి ఇకపై వన్డే, టీ20 కెప్టెన్ కాదనే విషయం తెలసిందే. కానీ, టెస్ట్ కెప్టెన్‌గా అతను తన విజయాలను పునరావృతం చేయాలనుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టు సిరీస్ గెలిచిన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాలో జరిగే టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలవడమే తన లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నాడు. గాయపడిన రోహిత్ శర్మ టెస్టు జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీకి జట్టుపై నమ్మకం ఉంది.
దక్షిణాఫ్రికా నుంచి 7 సార్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చిన టీమిండియా! 7 సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా ప్రతిసారి నిరాశగానే తిరిగి వచ్చింది. గత పర్యటనలో విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా రాణించినా టెస్టు సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. 2010-11లో టీం ఇండియా టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా ఈ సిరీస్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈసారి విరాట్ కోహ్లీ తన నాయకత్వంలోని జట్టు దక్షిణాఫ్రికాలో గెలవాలని కోరుకుంటున్నాడు.
కాగా, ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా ఫామ్‌లో లేకపోవడం టీమ్ ఇండియాకు చాలా కష్టంగా మారింది. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నాడు. కానీ, అతను స్నాయువు గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ పూర్తి షెడ్యూల్.. డిసెంబర్ 26-30 తేదీల్లో సెంచూరియన్‌లో భారత జట్టు తొలి టెస్టు ఆడనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది. మూడో, చివరి టెస్టు జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది. టెస్టు సిరీస్ తర్వాత జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ పార్ల్‌లో ప్రారంభం కానుంది. జనవరి 21న రెండో వన్డే కూడా పార్ల్‌లో జరగనుంది. చివరి వన్డే కేప్‌టౌన్‌లో జరగనుంది.
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), వృద్ధిమాన్ సాహా (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్ శర్మ, షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రియాంక్ పాంచల్.
స్టాండ్‌బై ఆటగాళ్లు: నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగ్వాస్వాలా
All buckled up ✌?
South Africa bound ✈️??#TeamIndia #SAvIND pic.twitter.com/fCzyLzIW0s
— BCCI (@BCCI) December 16, 2021