Team India : టీమిండియాకు గాయాల శాపం..సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు బీసీసీఐ నయా ప్లాన్
ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే 2-3 నెలల పాటు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయం కారణంగా ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఆడటం లేదు.

Team India : ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే 2-3 నెలల పాటు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయం కారణంగా ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఆడటం లేదు. గిల్ కోల్‌కతా టెస్ట్‌లో మెడ గాయానికి గురైన సంగతి తెలిసిందే. కీలకమైన కెప్టెన్, వైస్ కెప్టెన్ సిరీస్‌కు దూరం కావడంతో సెలెక్టర్లు ఫైనల్ జట్టు సైలక్షన్ పై తర్జనభర్జన పడుతున్నారు.
మెడ గాయం తర్వాత శుభ్‌మన్ గిల్ టీమిండియాతో కలిసి కోల్‌కతా నుంచి గౌహతికి వచ్చినా రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. తాజాగా వైద్యులు గిల్‌కు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ దినశావ్ పార్దివాలా గిల్‌కు మరికొంత కాలం రెస్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు.
అయితే గిల్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉండవచ్చని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తదుపరి వారంలో గిల్‌కు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, అతను టీ20 సిరీస్‌లో ఆడతాడా లేదా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. శుభ్‌మన్ గిల్ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో జట్టు ఎంపికపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “దురదృష్టవశాత్తు, శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉండడు” అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
త్వరలోనే గౌహతిలో సెలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కెప్టెన్సీతో పాటు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల పేర్లపై చర్చ జరిగే అవకాశం ఉంది. గిల్, అయ్యర్ గైర్హాజరీతో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం భారత జట్టులో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో, టీమ్ మేనేజ్‌మెంట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో, యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ లేదా యువ సంచలనం తిలక్ వర్మ వంటి వారిని నెం.4 స్థానంలో సెలక్ట్ చేయవచ్చని తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
