IPL 2025: జీటీకి బిగ్ షాక్! జట్టును వీడి స్వదేశంలో ల్యాండ్ అయిన పక్షి రాజా
గుజరాత్ టైటాన్స్ జట్టును వరుసగా ఆటగాళ్లు విడిచిపెడుతున్నారు. రబాడా వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోవడమే కాకుండా, గ్లెన్ ఫిలిప్స్ గజ్జ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఫిలిప్స్ ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా SRH మ్యాచ్‌లో గాయపడడం జట్టుకు పెద్ద లోటుగా మారింది. విదేశీ ఆటగాళ్లను కోల్పోవడం టైటాన్స్‌కు గట్టి దెబ్బగా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును విడిచి స్వదేశానికి వెళ్లగా, తాజాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ గజ్జ గాయంతో బాధపడటాన్ని గుర్తు చేస్తూ, అతను స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు తెలిపింది.
ఈ సీజన్‌లో గ్లెన్ ఫిలిప్స్ గుజరాత్ టైటాన్స్ తరఫున ప్లేయింగ్ XIలో భాగంగా లేను అయినప్పటికీ, SRHతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా మైదానంలో ఉన్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో, పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్, ఇషాన్ కిషన్ బలంగా కొట్టిన బంతిని ఛేజ్ చేసి తిరిగి విసిరే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను భయంకర నొప్పితో నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే టీమ్ మెడికల్ సిబ్బంది స్పందించి, ఇతరులతో కలిసి ఫిలిప్స్‌ను మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు.
దీంతో గుజరాత్ టైటాన్స్ శిబిరం నుండి ఇంటికి వెళ్లిన రెండవ విదేశీ ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు. అంతకుముందు కగిసో రబాడా వ్యక్తిగత కారణాలతో జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వరుసగా విదేశీ ఆటగాళ్లను కోల్పోవడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఆకాంక్షలకు తగ్గ ప్రదర్శన చూపలేకపోతున్న టైటాన్స్‌కు, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడం మరింత అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇది జట్టు కాంబినేషన్లపై ప్రభావం చూపే ప్రమాదమూ ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్ , నికోలస్ పూరన్ , రిషబ్ పంత్ (Wk/c), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్ , అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్ , ఆకాష్ దీప్ , దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ , రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: సాయి సుదర్శన్ , శుభమన్ గిల్ (c), జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ , షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా , అర్షద్ ఖాన్ , రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ , మహ్మద్ సిరాజ్
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..