IPL 2025 GT vs LSG: హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్.. లక్నో టార్గెట్ ఎంతంటే?
IPL 2025: సీజన్ 18లో భాగంగా ఇవాళ ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ముందు గుజరాత్ 181 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి (180) పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ (60), సాయి సుదర్శన్ 56 పరుగులతో చెరో హాఫ్ సెంచరీతో చెలరేగగా..రూతర్‌ఫడ్ (22), బట్లర్ (16) పరుగులు చేశారు. అటు లక్నో బౌలర్స్‌లో రవి బిష్ణోయ్, షార్దుల్ చెరో (2) వికెట్లు తీయగా అవేశ్‌ఖాన్, దిగ్వేష్, చెరో వికెట్ తీశారు.

ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్ ఇవాళ లక్నోతో తలబడుతోంది. టాన్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి (180) పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన శుభమన్ గిల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్‌ను కొనసాగించారు. లక్నో బౌలర్స్‌కు వికెట్ తీసే ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరి భాగస్వామ్యంలో (120) పరుగులు చేశారు. నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్ గిల్‌కు అవేష్ ఖాన్ షాక్ ఇచ్చాడు. (12.1) ఓవర్‌లో అవేష్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కి ప్రయత్నించిన గిల్ మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. (38 బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్‌తో గిల్ (60) పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రవి బిష్ణోయ్ వేసిన బంతికి నికోలస్ పురన్‌కు క్యాచ్ ఇచ్చిన సాయి సుదర్శన్ వెనుతిరిగాడు. (37 బంతుల్లో సాయి సుదర్శన్ 57 పరుగులు) చేశాడు. తర్వాత వచ్చిన రూతర్‌ఫర్డ్ (22) పరుగులు చేయగా, జాస్ బట్లర్ (16) పరుగులు చేశాడు. ఇక నెక్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ఖాన్ (11) పరుగులు చేయడంతో 20 ఓవర్లలో గుజరాత్ (180) పరుగులు చేసింది. అటు అటు లక్నో బౌలర్స్‌లో రవి బిష్ణోయ్, షార్దుల్ చెరో 2 వికెట్లు తీయగా అవేశ్‌ఖాన్, దిగ్వేష్, చెరో వికెట్ తీశారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి