RR vs RCB: రాణించిన దినేష్ కార్తిక్, అహ్మద్.. నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరు విజయం..
IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)పై రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు(RCB) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది...
IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)పై రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు(RCB) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దినేష్ కార్తిక్(Dinesh Karthik) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు షబాజ్ అహ్మద్ రాణించడంతో బెంగుళూరు గెలుపొందింది. దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 44(7 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో అజేయంగా నిలవగా.. షబాజ్ అహ్మద్ 26 బంతుల్లో 45(4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేశాడు. ఆరంభంలో దూకుడుగా ఆడిన బెంగళూరు ఆరో ఓవర్ డు ప్లెసిస్ ఔట్ కావడంతో కష్టాల్లో పడింది. ఆ వెంటనే రావత్, కోహ్లీ, డెవిడ్ విల్లీ, రూథర్‌ఫార్డ్ పెవిలియన్ చేరాడు. దినేష్ కార్తిక్ రాకతో బెంగళూరులో ఊపు వచ్చింది. అతడు వచ్చేది రాగానే విరుచుకుపడ్డాడు. బెంగుళూరు ఇన్నిగ్స్‌లో డు ప్లెసిస్ 20 బంతుల్లో 29(5 ఫోర్లు), రావత్ 25 బంతుల్లో 26(4 ఫోర్లు), కోహ్లీ 5, డెవిడ్ విల్లీ డకౌట్, రూథర్‌ఫార్డ్ 5 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా సైనీ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు పవర్ ప్లే పూర్తయ్యాక కాస్త వేగం పెంచారు. జోస్ బట్లర్ 47 బంతుల్లో 70(6 సిక్స్‌లు), షిమ్రాన్ హెట్మెయర్ 31 బంతుల్లో 42(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో అజేయంగా నిలిచారు. చివరి రెండు ఓవర్లలో సిక్సుల వర్షం కురిపించి, బెంగళూర్ బౌలర్లను ఉతికారేశారు. దేవదత్ పడిక్కల్ 29 బంతుల్లో 37(2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శాంసన్ 8, జైస్వాల్ 4 పరుగులు చేసి పెవిలయన్ చేరారు. బెంగళూరు బౌలర్లలో విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.రేపు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలపడనుంది. బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read Also.. Senior Athletics Championship: అద్భుతం చేసిన 29 ఏళ్ల భారత అథ్లెట్.. 22 ఏళ్లనాటి రికార్డులకు బీటలు..