AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ధోని ఉన్నా ఏం చేయలేడు! పాక్‌ మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై పాక్ ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ సనా మీర్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు ఎంపికే తప్పు అని, ధోని లాంటి గొప్ప కెప్టెన్ ఉన్నా ఈ జట్టును గెలిపించలేరని ఆమె అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓటమితో పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సెలెక్టర్ల తప్పుల వల్లే ఈ పరాజయం అని ఆమె పేర్కొన్నారు.

Champions Trophy: పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ధోని ఉన్నా ఏం చేయలేడు! పాక్‌ మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Sana Mir Ms Dhoni
SN Pasha
|

Updated on: Feb 26, 2025 | 7:38 AM

Share

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్‌ జట్టు అధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో, ఆ తర్వాత టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాక్‌.. ఇంటి బాట పట్టింది. టీమిండియాపై ఓటమి తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ.. న్యూజిలాండ్‌ చేతిలో బంగ్లా ఓటమితో.. పాక్‌, బంగ్లా రెండు టీమ్స్‌ కూడా అధికారికంగా ఎలిమినేట్‌ అయిపోయాయి. గ్రూప్‌ ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటికే సెమీస్‌ చేరుకున్నాయి. ఇక ఇండియా – న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ – బంగ్లాదేశ్‌ మధ్య నామమాత్రపు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

కాగా, ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. ఫేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్‌గా నిలిచింది. ముఖ్యంగా టీమిండియాపై ఓటమి తర్వాత పాక్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాక్‌ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా పాక్‌ టీమ్‌ను ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ సైతం ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ ప్రదర్శనపై స్పందించారు. పాకిస్థాన జట్టు ఇలా ఆడుతుందనే విషయం తనకు ముందు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేయగానే.. తనకు ఆ విషయం అర్థమైందని తెలిపారు.

జట్టు ఎంపిక సరిగ్గా జరగలేదని, పరిస్థితులకు తగ్గట్లు జట్టును ఎంపిక చేయడంలో పాక్‌ సెలెక్టర్లు విఫలం అయ్యారని, ఇలాంటి టీమ్‌తో కెప్టెన్‌గా ఉన్న రిజ్వాన్‌ కాదు కాదా, మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్‌ ధోని కూడా ఏం చేయడలేడని సనా అన్నారు. అంటే టీమ్‌ వరెస్ట్‌గా ఉంటే ధోని అంత గొప్ప కెప్టెన్‌ వచ్చినా పాకిస్థాన్‌ జట్టును గెలిపించలేడని ఆమె ఉద్దేశం. ఇక ధోని ఎంత గొప్ప కెప్టెనో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా ధోని పేరు భారత క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల కెప్టెన్సీలో కూడా టీమిండియా అద్భుతంగా దూసుకుపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.