
ఐపీఎల్ 17వ సీజన్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధనాధన్ లీగ్ లో తమ జట్టును ముందుండి నడిపించే కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. క్రికెట్ అభిమానులలో గత కొన్ని రోజులుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? అన్న చర్చ సాగింది. అయితే ఎట్టకేలకు ఢిల్లీ ప్రకటనతో ఈ సస్పెన్స్ కు తెరపడింది. అందరూ అనుకున్నట్లే ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా 16వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు పంత్. దీంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే 17వ సీజన్‌కు ముందు రిషబ్ పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్ పేరు ప్రచారంలో ఉంది. కాబట్టి పంత్, వార్నర్ మధ్య కెప్టెన్సీ ఎవరికి వస్తుంది? అన్న చర్చ అలా జరిగింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ పైనే నమ్మకముంచింది. మొత్తానికి రిషబ్ నాయకత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఐపీఎల్ లో బరిలోకి దిగనుంది.
కాగా, లోక్‌సభ ఎన్నికల కారణంగా 17వ సీజన్‌లో తొలి దశ 17 రోజుల షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. తొలి దశలో 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీని ప్రకారం, ప్రతి జట్టు కనిష్టంగా 3, గరిష్టంగా 5 మ్యాచ్‌లు ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ 17వ సీజన్‌లో తమ మొదటి మ్యాచ్‌ని రెండవ రోజు అంటే మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఐదో మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో జరగనుంది.
COMEBACK DONE 👉🏼 NOW WELCOME BACK, CAPTAIN RISHABH PANT 💙❤️#YehHaiNayiDilli #IPL2024 pic.twitter.com/wN7xDgLW31
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2024
రిషబ్ పంత్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్, రికీ భుయ్, హ్యారీ బ్రూక్, యశ్ ధూల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్ , ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, ఎన్రిక్ నార్ట్జే, విక్కీ ఓస్త్వాల్, రసిఖ్ సలామ్, జే రిచర్డ్సన్, ఇషాంత్ శర్మ, స్వస్తిక్ చికారా మరియు కుమార్ కుషాగ్రా.
Grit. Determination. Believe. Rishabh Pant 🫶
🔙 to 🏏 and 🔙 as our ℂ𝔸ℙ𝕋𝔸𝕀ℕ 💙#YehHaiNayiDilli #IPL2024 #RishabhPant pic.twitter.com/wZydHBPudP
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..